Business Idea : ఈ ఒక్క ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదించొచ్చు.. రైతుల ఆదాయం డబుల్ అవుతుంది..
Business Idea : ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతుల పరిస్థితులు మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నాయి. ఎప్పుడూ అన్నదాతలు అల్లాడుతూనే ఉన్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మార్కెట్ లో సరైన ధర రాక చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. పంటకు మద్దతు ధర రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ పంటలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో రసాయన ఎరువులకు బదులుగా సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పంటలను చాలా మంది కోరుకుంటున్నారు. వాటికి ఎంత ధర పెట్టి కొనడానికి అయినా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఆర్గానిక్ ఎరువుల వాడకం పెరుగుతోంది.
దీంతో సేంద్రీయ ఎరువుల తయారీ కూడా రైతులకు మంచి ఆదాయ వనరు అయ్యే ఛాన్స్ ఉంది.ఆర్గానిక్ ఎరువుల తయారీకి అన్నదాతలుక ఐడియాల కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం సేంద్రీయ ఎరువుల తయారీ చాలా బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆర్గానిక్ ఎరువులను తయారు చేసి రైతులకు అమ్మితే ఊహించని స్థాయిలో లాభాలు కళ్లజూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అరటి తోటల్లో అరటి గెలలను సేకరించిన తర్వాత అరటి చెట్లు నిరుపయోగంగా మారుతుంటాయి. ఆ చెట్టులోని అరటి కాండం దేనికి పనికి రాదని అనుకుంటారు. వాటిని కత్తిరించేసి పక్కన పడేస్తారు. అయితే ఈ అరటి కాండం మంచి ఆదాయాన్ని తెచ్చి పెట్టేదిగా మార్చుకోవచ్చు. దాని కోసం చేయాల్సిందల్లా ఆ అరటి కాండాన్ని సేకరించి దానితో సేంద్రీయ ఎరువులను తయారు చేయాలి.అరటి కాండాన్ని సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
ఒక గొయ్యిలో వాటిని పాతి పెట్టాలి. ఆ తర్వాత ఆవు పేడ, కలుపు మొక్కలను కాండంతో పాటు గుంతలో వేయాలి. దీంతో పాటు డీకంపోజర్ కూడా స్ర్పే చేయండి. ఈ కాండం, ఇతర పదార్థాలు సేంద్రీయ ఎరువుగా కుళ్లిపోతాయి. అందులోని సారవంతమైన మట్టిని పొలాల్లో ఆర్గానిక్ ఎరువుగా వాడొచ్చు. దీంట్లోని పోషకాలు పంటకు అంది మంచి దిగుబడి వచ్చేలా చేస్తాయి. ఈ ఒక్కటే కాదు ఆర్గానిక్ ఎరువులను ఇంకా చాలా పంట వ్యర్థాలతోనూ తయారు చేయవచ్చు. ఆవు పేడ, ఆవు మూత్రం, వేప ఆకులు ఇలా పలు పదార్థాలతో సేంద్రీయ ఎరువులను తయారు చేయవచ్చు. సేంద్రీయ ఎరువుల తయారీ, వాడకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. దీనిపై రైతులకు అవగాహన కార్యక్రమాలూ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి. శిక్షణ కూడా ఇస్తున్నాయి.