లక్షల్లో జీతం వచ్చే జాబ్ వదిలి డెయిరీ వ్యాపారంతో 44 కోట్లు సంపాదిస్తున్నాడు..!
dairy farm ప్రస్తుతం ఎక్కడ చూసినా మనం తినే ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. ముఖ్యంగా రోజూ మనం తాగే పాలు కల్తీ బాగా అవుతున్నాయి. రక రకాల పదార్థాలతో పాలను కల్తీ చేస్తున్నారు. దీంతో స్వచ్ఛమైన పాలు మనకు లభించడం లేదు. అయితే ఇదే విషయాన్ని గమనించిన ఆ వ్యక్తి తాను చేస్తున్న రూ.లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలి పెట్టి స్వదేశానికి వచ్చాడు. పాల వ్యాపారం చేస్తూ ఏటా రూ. 44 కోట్లు సంపాదిస్తున్నాడు. అతనే హైదరాబాద్‌కు చెందిన కిశోర్ ఇందుకూరి.
రూ.1 కోటి పెట్టుబడితో..
హైదరాబాద్‌కు చెందిన కిశోర్ ఇందుకూరి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యను అభ్యసించాడు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో పాలిమర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ చేశాడు. అనంతరం అతనికి ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్‌లో జాబ్ వచ్చింది. రూ.లక్షల్లో జీతం. కానీ వ్యవసాయం మీద మక్కువతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. 6 ఏళ్ల పాటు జాబ్ చేసి తిరిగి హైదరాబాద్‌కు వచ్చి పాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే అతను రూ.1 కోటి పెట్టుబడితో కోయంబత్తూర్‌లో 20 ఆవులను కొనుగోలు చేసి డెయిరీ బిజినెస్ ప్రారంభించాడు.
2012లో డెయిరీ వ్యాపారం dairy farm ప్రారంభించినా అతను విజయాల బాట పట్టేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆర్థిక సహకారంతో అతను వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చాడు. 2016లో తన డెయిరీ ఫామ్‌ను సిద్స్ ఫామ్ గా రిజిస్టర్ చేశాడు. ఈ క్రమంలోనే అతను దినదిన ప్రవర్థమానంగా ఎదిగాడు. సక్సెస్ సాధించాడు.
ప్రస్తుతం కిశోర్ తన డెయిరీ ఫామ్ dairy farm ద్వారా రోజుకు 10వేల మంది కస్టమర్లకు స్వచ్ఛమైన పాలను సరఫరా చేస్తున్నాడు. నాణ్యతే ప్రథమ ప్రాధాన్యతగా పాలను సరఫరా చేస్తుండడంతో అతను వినియోగదారుల అభిమానం చూరగొన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం అతని దగ్గర 120 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తన ఫామ్ ద్వారా అతను గతేడాది రూ.44 కోట్ల టర్నోవర్ సాధించినట్లు స్వయంగా తెలిపాడు. కరోనా ఉన్నప్పటికీ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా వారికే పాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు. ఇక ప్రస్తుతం అతను గేదె పాలను, వెన్న, నెయ్యి, పెరుగు వంటి ఉత్పత్తులను కూడా విక్రయించడం మొదలు పెట్టాడు.