Business Idea : ఎవరికి తెలియని బిజినెస్ ..? నెలకి రెండు లక్షల ఆదాయం ..!!
Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయాలని కలలు కంటున్నారు. కొంతమంది పెట్టుబడి పెట్టే స్తోమత లేక బిజినెస్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. మరి కొంతమంది పెట్టబడి పెట్టగలిగేటట్లు ఉన్న ఏ వ్యాపారం చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. అలాంటి వారికి ఈ బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఫుడ్ ఇండస్ట్రీకి ఫుల్ డిమాండ్ ఉంది. జనాభా పెరుగుతున్న కొద్ది ఫుడ్ బిజినెస్ కి డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ వ్యాపారంలో మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చిరుధాన్యాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది.
చిరుధాన్యాలతో చేసిన వంటలతో బిజినెస్ చేస్తే చక్కటి ఆదాయం పొందవచ్చు. మిల్లెట్స్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేస్తే మంచి ఆదరణను పొందవచ్చు. ముఖ్యంగా చిరుధాన్యాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా చిరుధాన్యాల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. మిల్లెట్స్ తో తయారు చేసిన టిఫిన్లను తినడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఈ బిజినెస్ ప్రారంభిస్తే సక్సెస్ అవ్వవచ్చు. ఉదాహారణకు మిల్లెట్స్ తో తయారు చేసే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పొంగలి, పాయసం, బిర్యానీ వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.
రుచితో పాటు చిరుధాన్యాల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి చిరుధాన్యాలతో తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ లను తినేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ముందుగా మిల్లెట్స్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే మిల్లెట్స్ వలన కలిగే లాభాల గురించి ప్రచారం చేయాలి. సాధారణ టిఫెన్లతోపాటు మిల్లెట్స్ టిఫిన్లను కూడా టిఫిన్ సెంటర్లో అందుబాటులో ఉంచితే నెమ్మదిగా ప్రజలు మిల్లెట్స్ టిఫిన్ పట్ల ఇష్టం పెంచుకుంటారు. టేస్ట్ తో పాటు క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడే వ్యాపారం సక్సెస్ అవుతుంది. టిఫిన్ సెంటర్ డెవలప్ అయ్యే కొద్దీ ప్రచారం పెంచితే మరింత లాభం పొందవచ్చు.