TSRTC MD Sajjanar : ప్రాణాలు ప‌ణంగా పెట్టి వికృత ప్ర‌యాణం.. బైక్‌పై ఇంత మంది ప్ర‌యాణంపై స‌జ్జ‌నార్ ట్వీట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TSRTC MD Sajjanar : ప్రాణాలు ప‌ణంగా పెట్టి వికృత ప్ర‌యాణం.. బైక్‌పై ఇంత మంది ప్ర‌యాణంపై స‌జ్జ‌నార్ ట్వీట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 April 2024,9:30 pm

TSRTC MD Sajjanar : ఇటీవ‌ల చాలా మంది ప్రాణాలు ప‌ణంగా పెట్టి జ‌ర్నీలు చేస్తున్నారు.అయితే ఎవ‌రు ఎన్ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నా కూడా వాటిని పెడ చెవిన పెడుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ప‌రిస్థితులు గ‌మ‌నించిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సామాజిక మాధ్యమంలో అలాంటి వారికి హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు. తాజాగా మండుటెండలో ఓ వ్యక్తి బైక్‌పై ఆరుగురిని (ఆయనతో కలిపి ఏడుగురు) ఎక్కించుకుని ప్రయాణిస్తున్నాడు. వారిలో ఐదుగురు చిన్నారులు కాగా, వారి ప్ర‌యాణం చాలా భ‌యంక‌రంగా సాగుతుంది.

TSRTC MD Sajjanar : ఎందుకింత అజాగ్ర‌త్త‌…

అయ‌తే బైక్‌పై ముగ్గురు ప్రయాణించడమే నేరమైన వేళ ఏకంగా ఏడుగురితో ప్రయాణిస్తూ అంద‌రిని భ‌య‌భ్రాంతుల‌కి గురి చేశాడు. అయితే అనుకోని ప్రమాదం సంభవిస్తే వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఊహకే భయంకరంగా ఉందంటూ నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్ చేస్తున్నారు. ఈ క్లిప్‌ను షేర్ చేసిన సజ్జనార్.. మండుటెండలో ఒక్క బైక్‌పై ఇంతమందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఇలాంటి ప్రమాదకరమైన బైక్ ప్రయాణం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని సజ్జనార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రులు ఇలా ప్రవర్తించడం బాధాకరమని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.

TSRTC MD Sajjanar ప్రాణాలు ప‌ణంగా పెట్టి వికృత ప్ర‌యాణం బైక్‌పై ఇంత మంది ప్ర‌యాణంపై స‌జ్జ‌నార్ ట్వీట్

TSRTC MD Sajjanar : ప్రాణాలు ప‌ణంగా పెట్టి వికృత ప్ర‌యాణం.. బైక్‌పై ఇంత మంది ప్ర‌యాణంపై స‌జ్జ‌నార్ ట్వీట్..!

స‌జ్జ‌నార్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయ‌న త‌రచు రోడ్డు ప్ర‌మాదాల‌కి సంబంధించిన విష‌యాల‌ని షేర్ చేస్తూ ఉంటారు. ముంబైలో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాద విజువల్స్ ను ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. రోడ్డు దాటుతున్న ఇద్దరు యువతులను ఓ కారు అతివేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోవడం అందులో ఉండ‌గా, ఈ ఘటనలో యువతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటని నెటిజన్లను సజ్జనార్ ప్రశ్నించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడా? లేక పాదచారుల అజాగ్రత్త కారణమా అని అడుతుగూ… తన పోస్ట్ కు రోడ్ సేఫ్టీ, ఓవర్ స్పీడ్, రోడ్ యాక్సిడెంట్, రోడ్, డ్రైవ్ సేఫ్, పెడెస్ట్రియన్, డ్రైవ్ స్లో సేవ్ లైఫ్ అనే పదాలను హ్యాష్ ట్యాగ్ లుగా జత చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది