RBI Governor : ఆర్బీఐ గవర్నర్ సంతకం లేని ఒకే ఒక్క నోటు ఏదో తెలుసా..?
RBI Governor : ప్రస్తుతం డిజిటల్ యుగంలో కరెన్సీ నోట్ల చెలామణి కూడా ఓ రేంజ్‌లో ఉంది. దేశంలో ప్రస్తుతం ఒక రూపాయి నుండి 500 రూపాయల వరకు కరెన్సీ నోట్లు ఉన్నాయి. మొన్నటి వరకు రెండు వేల రూపాయల నోట్లు కూడా చెలమాణీలో ఉండగా, వాటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే త్వరలో 500 రూపాయల నోట్లు కూడా రద్దు అవుతాయనే ప్రచారం ఒకటి ఉంది. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు కాని, ఆ వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది.అయితే ప్రస్తుం మనకు చెలామణీలో ఉన్న నోట్లు చూస్తే అందులో 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు ఉన్నాయి.
RBI Governor : ఒక్క రూపాయి మీద ఎందుకు ఉండదు
ఈ నోట్లపై మీరు గమనించి ఉంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం కనిపిస్తుంది. అయితే అన్ని నోట్ల మీద ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉండదు. రూపాయి నోటు మీద ఆర్‌బీఐ గవర్నర్‌కు బదులుగా ఆర్థిక కార్యదర్శి సంతకం చేశారు. అందుకు ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఒక్క రూపాయి నోటు మినహా భారతదేశంలోని అన్ని కరెన్సీ నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. రూపాయి నోటుని భారత ప్రభుత్వం జారీ చేసింది కాబట్టి నోటుపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ బదులుగా ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. ఈ నోట్లను ప్రింట్ చేసేటప్పుడు, గ్రీన్ కలర్ పేపర్‌ని ఉపయోగిస్తారు.

RBI Governor : ఆర్బీఐ గవర్నర్ సంతకం లేని ఒకే ఒక్క నోటు ఏదో తెలుసా..?
మొదటి రూపాయి నోటు 1917 నవంబర్ 30న చెలామణిలోకి రాగా, 1926లో దీని ముద్రణ ఆగిపోయింది. ఆ తర్వాత 1940లో మళ్లీ ముద్రణ ప్రారంభించారు. 1994 వరకు దీని ముద్రణ జరగగా, ఆ తర్వాత మూతపడింది. 2015లో మళ్లీ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఒక్క రూపాయి నోట్ల ముద్రణ జరిగింది. ఇక ఇదిలా ఉంటే భారతదేశంలో నోట్లకు సంబంధించి 2016లో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఆ సమయంలో కొత్త రూ. 500 నోటు, కొత్త రూ.2,000 నోటును ప్రవేశపెట్టారు. రూ.200 నోటు కూడా వచ్చింది. ఆ తర్వాత మే 2023లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించడం జరగడం మనం చూశాం.