Business Idea : ఉన్నితో షూలను తయారు చేసి అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్న మహిళ.. ఎలా సాధ్యమైందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : ఉన్నితో షూలను తయారు చేసి అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్న మహిళ.. ఎలా సాధ్యమైందో తెలుసా?

 Authored By jyothi | The Telugu News | Updated on :28 May 2022,12:00 pm

Business Idea : అవసరం ఆవిష్కరణకు అమ్మ వంటిది అని అంటారు. ఎందుకంటే మనం అవసరంలో ఉన్నప్పుడు, ఏదైనా బలంగా కావాలనుకున్నప్పుడు దానికి పరిష్కారం ఆలోచిస్తాం. ఏదైనా వస్తువుతో ఆ అవసరం తీర్చాలనుకుని చేసే ప్రయత్నంలో మనకు తెలియకుండానే కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాం. దీనినే ఇంగ్లీష్ లో నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. మణిపూర్ లోని కక్చింగ్ చెందిన మొయిరంగ్ థెం ముక్తామణి దేవి జీవితంలో అదే జరిగింది. ఇప్పుడు ఆమెను లక్షల్లో ఆదాయం అందిస్తోంది. అలాగే భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును కూడా సొంతం చేసుకునేలా చేసింది. వీటితో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే.. ఎంతో మందికి శిక్షణ అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది.

మణిపూర్‌లోని కక్చింగ్‌కు చెందిన మొయిరంగ్‌థెం ముక్తామణి దేవి మూడు దశాబ్దాల క్రితం చెప్పులు కుట్టే పనిని 1991 సంవత్సరంలో ప్రారంభించింది.ఆమె తన కుమార్తె కోసం ఒక కొత్త జత బూట్లు కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉండేది. తన కుమార్తె పాత షూ చిరిగిపోయినప్పుడు, దానిని సరిచేయడానికి ముక్తామణి దగ్గర ఒక్క పైసా కూడా లేదు. కాబట్టి, పాత బూట్ల అరికాళ్లను బేస్‌గా ఉపయోగించి ఉన్ని ‘మేక్‌ షిఫ్ట్’ షూలను అల్లాలని ఆమె నిర్ణయించుకుంది. తనకు తెలిసిన పనితోనే తన కూతురి షూను చక్కగా తయారు చేసింది. ఇది తన కుమార్తె ఉపాధ్యాయురాలిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె తన కుమార్తెకు కూడా అలాంటి షూసే కావాలని కోరుకుంది. అలా మొదలైన ప్రయాణాన్ని ముక్తామణి వ్యాపారంగా మలిచింది. అప్పటి నుండి ఆమె అలాంటి షూలను లక్షల్లో విక్రయిస్తోంది. అలాగే 2000 మందికి పైగా ఉన్ని చెప్పుల తయారీలో శిక్షణ ఇస్తోంది.

padma shri manipur woollen shoes shoemaker woman entrepreneur video

padma shri manipur woollen shoes shoemaker woman entrepreneur video

ఆమె అనేక ఇతర దేశాలకు తన బూట్లను ఎగుమతి చేస్తుంది. మరియు వాణిజ్యం మరియు పరిశ్రమల రంగంలో ఆమె చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు కూడా పొందింది.ముక్తామణిర తయారు చేసే ఉన్ని షూలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికోతో పాటు చాలా దేశాల్లో ముక్తామణి ఉన్ని షూలకు మంచి ఆదరణ ఉంది. ఏటా లక్షల్లో ఆర్డర్లు వస్తున్నాయి. వాటిని ఎంతో శ్రద్ధతో నిర్వర్తిస్తోంది ముక్తామణి. ఇలా తన బిజినెస్, తన నైపుణ్యానికి మంచి గుర్తింపు రావడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. అలాగే అది తన బాధ్యతను మరింత పెంచిందని చెబుతోంది. నాణ్యత పాటించే బాధ్యతను తను ఎప్పుడూ మోస్తూ ఉంటానని అంటోంది ముక్తామణి. అలాగే వేల మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం పట్ల ఆనందంగా ఉంది.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది