Business Idea : ముందు వాట్సప్ గ్రూప్.. ఆ తర్వాత 2 కోట్ల డౌన్ లోడ్స్.. ఇఫ్పుడు కోట్ల టర్నోవర్.. లోకల్ యాప్ సూపర్ సక్సెస్ ఎలా అయింది?
Business Idea : ప్రాంతీయ వార్తలు తెలుసుకోవాలంటే ఒకప్పుడు రెండే మార్గాలు ఉండేవి. ఒకటి ఎవరైనా చెబితే తెలుసుకోవడం రెండోది మరుసటి రోజు ఉదయం పేపర్ లో వస్తే తెలుసుకోవడం. ఇంగ్లీష్ లాంటి భాషలు తెలిసిన వారు న్యూస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. కానీ తెలుగు లాంటి లోకల్ భాషలకు ఆ సౌకర్యం ఉండేది కాదు. పేరు పొందిన వెబ్ సైట్లు వార్తలు ఇచ్చేవి. కానీ.. మన ఊర్లో, మన ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకునే వెసులుబాటు అందులో ఉండదు. ఈ అసౌకర్యమే విపుల్ చౌదరి, జానీ పాషాలకు కలిగింది.
ప్రాంతీయ భాషల్లో పూర్తి లోకల్ వార్తలను చేరవేయాలని అనుకున్నారు. అదే వారి బిజినెస్ ఐడియాగా మారడంతో పాటు హైపర్ లోకల్ ప్లాట్ ఫామ్ ను నిర్మించి దానిని టాప్ లో నిలబెట్టారు.విపుల్ చౌదరి, జానీ పాషాలు మొదట లోకల్ వార్తల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు. అందులో ఓ స్ట్రింగర్ నుండి సేకరించిన స్థానిక వార్తలను అందించేవారు. ఇది చాలా తక్కువ కాలంలోనే చాలా మందిని ఆకట్టుకుంది. ఆ గ్రూపులో చేరే వారి సంఖ్య పెరిగింది.2018లో ఒక యాప్ ను తీసుకువచ్చారు విపుల్, జానీలు. మొదట కేవలం వార్తలను అందించేవారు. అది కూడా ఒకే స్క్రోల్ చేస్తూ వార్తలను తెలుసుకునేలా సింపుల్ గా ఉండేలా తయారు చేశారు.

product roadmap local hyperlocal content social media app
లోకల్ యాప్ చాలా సింపుల్ గా ఉండటంతో పాటు హైపర్ లోకల్ న్యూస్ అందించడంతో దానిని విస్తరించారు ఆ ఇద్దరు స్నేహితులు. ఆ తర్వాత వార్తలతో పాటు ఉద్యోగ ప్రకటనలు, మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్ అందించారు. అలా ఒక్కొక్క ఫీచర్ ను అందిస్తూ వినియోగదారుల సంఖ్యను పెంచుకున్నారు.ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో స్థానిక వార్తలు, ఉద్యోగ ప్రకటనలు, మ్యాట్రిమోనీ యాడ్స్ అందిస్తున్నారు. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న లోకల్ యాప్ ఇప్పుడు 20 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ లు అలాగే 6 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది.