Businesss Idea : వ్యవసాయం ఇలా చేస్తే.. లక్షల ఆదాయం వస్తుంది.. ఈయన చూడండి నెలకు ఎంత సంపాదిస్తున్నాడో?
Businesss Idea : వ్యవసాయం అనగానే.. అస్సలు లాభం ఉండదు. పెట్టిన పెట్టుబడి కూడా రాదు అంటారు చాలామంది. కానీ.. వ్యవసాయం అనేది లాభసాటి వ్యాపారం అని.. వ్యవసాయంలో లక్షలు సంపాదించవచ్చు అని నిరూపించాడు ఏపీలోని ఏలూరుకు చెందిన ఓ రైతు. ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎలాంటి రసాయనాలు వాడకుండా లక్షలు గడిస్తున్నాడు.
ఆయన పేరు సదా శివ సత్యనారాయణ. ఆయనది వ్యవసాయ కుటుంబమే. మధ్యలో ఆయనకు పలు అనారోగ్య సమస్యలు రావడంతో ప్రకృతి వ్యవసాయం చేయడానికి మొగ్గు చూపారు. రసాయనాలతో అన్ని కూరగాయలు, పండ్లు నిండిపోవడంతో 2014 నుంచి తనకున్న 16 ఎకరాల వ్యవసాయ కొబ్బరి సాగు, పామాయిల్ సాగు, వరి, కూరగాయలు సాగు చేస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు.
Businesss Idea : 12 ఎకరాలు కొబ్బరితోటే
ఆయనకు ఉన్న 16 ఎకరాలలో 12 ఎకరాలు కొబ్బరితోటే ఉంది. ఒక ఎకరానికి 60 చెట్లను పెట్టారు. కొన్ని ఎకరాల్లో కోకో తోట, మరికొన్ని ఎకరాల్లో పామాయిల్ తోట వేసి నెలకు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన. వర్మి కంపోస్ట్ తయారు చేసుకొని వాటినే చెట్లకు ఎరువుగా వేస్తూ చెట్ల నుంచి ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు ఆయన. అలాగే.. శివ సత్యనారాయణ నాటు కోళ్లను కూడా పెంచుతున్నారు. చాలా రకాల నాటుకోళ్లను పెంచుతూ.. వాటి ద్వారా మాంసం, గుడ్లను పొందుతున్నారు. అలాగే.. ఆయనకు పశువుల పాక కూడా ఉంది. ఆవులు, ఎద్దుల నుంచి పాలు, పేడను సేకరిస్తున్నాడు. జీవామృతం సేకరిస్తున్నాడు.
