Today Gold Price : ఏం కొంటాం.. మళ్లీ లక్ష కు చేరుకున్న బంగారం…!
ప్రధానాంశాలు:
Today Gold Price : ఏం కొంటాం.. మళ్లీ లక్ష కు చేరుకున్న బంగారం...!
Today Gold Price : మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు Gold Rates భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,070కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,650 పలికింది. వెండి ధర కూడా పెరిగి ఒక కేజీకి రూ. 98,591గా నమోదైంది. అంతర్జాతీయంగా అమెరికాలో ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 3400 డాలర్లను దాటడంతో దేశీయంగా కూడా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనివల్ల బంగారంపై పెట్టుబడి పెట్టిన వారు లాభపడినా, ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే ప్రజలకు ఇది ఒక్కింత ఆర్థిక భారంగా మారింది.

Today Gold Price : ఏం కొంటాం.. మళ్లీ లక్ష కు చేరుకున్న బంగారం…!
Today Gold Price : బంగారు కొనుగోలు దారులకు గుండె పగిలే న్యూస్
ఇక రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులు కూడా బంగారం ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా – చైనా వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, చర్చలు జరుగుతున్నాయి. అవి విజయవంతమైతే స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయని, తద్వారా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమ వుతున్నాయి. “ఆపరేషన్ సింధూర్” పేరుతో భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్ర శిక్షణ శిబిరాలపై దాడులు చేయడంతో దేశీయంగా భయాందోళనలు నెలకొన్నాయి. దీనివల్ల బంగారం ధరలు మరింత పెరిగే అవకాశమున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర అవసరాల కోసం బంగారు ఆభరణాలు కొనాలనుకునే వారు హాల్‌మార్క్ బంగారంపైనే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉన్న బంగారం మాత్రమే విక్రయించాలనే ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుత ధరల నేపథ్యంలో ఖర్చులు పెరిగినా, నాణ్యతపై రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్‌లో నష్టాల నుంచి తప్పించుకోవచ్చని నిపుణుల సూచన.