Today Gold Price : పసిడి ప్రియులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు.. బంగారం భారీగా తగ్గాయోచ్ !!
ప్రధానాంశాలు:
Today Gold Price : పసిడి ప్రియులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు.. బంగారం భారీగా తగ్గాయోచ్ !!
Today Gold Price : శ్రావణ మాసం Shravan maas ప్రారంభం కావడం తో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రభావాలు కూడా కలిసి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఫలితంగా బంగారం ధరల్లో ఆశ్చర్యకరమైన తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, తాజాగా పడిపోయి వినియోగదారులకు ఊరటను అందించాయి. స్థిర ఆదాయం కోసం కమోడిటీ మార్కెట్ వైపు చూస్తున్న పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశంగా మారింది.
Today Gold Price : పసిడి ప్రియులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు.. బంగారం భారీగా తగ్గాయోచ్ !!
Today Gold Price : శ్రావణమాసం ఎఫెక్ట్ .. బంగారం ధరలు భారీగా తగ్గాయోచ్ !!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,960 (10 గ్రాములకు)గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.92,540కి చేరింది. ముఖ్యమైన నగరాల్లో కూడా ఇదే స్థిరత కనబడుతోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ధరలు ఈ స్థాయిలో ఉండటం విశేషం. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు మరింత తగ్గాయి. దీని వల్ల పెళ్లిళ్లు, వ్రతాలు, శ్రావణ మాసపు పూజల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారి ఆనందానికి అంతులేదు.
ఇకపై మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయన్నదానిపై స్పష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, డాలర్ విలువ, క్రూడ్ ఆయిల్ ధరల మార్పులు వంటి అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. అయినా ప్రస్తుతం ఉన్న తగ్గుదల, వినియోగదారులకు మరియు స్వల్పకాలిక పెట్టుబడిదారులకు మంచి అవకాశం. కనుక, బంగారం కొనాలనుకునేవారు ఇది సద్వినియోగం చేసుకోవచ్చు.