Today Gold Price : నాల్గు రోజుల్లో రూ. 4 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ఎంత ఉందంటే..!!
ప్రధానాంశాలు:
నాల్గు రోజుల్లో రూ. 4 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఎంత ఉందంటే..!!
నాల్గు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత ఉందంటే..!!
Today Gold Price : గత నాల్గు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ నాలుగు రోజుల వ్యవధిలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.4,100 పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు (శనివారం) కూడా బంగారం ధరలు మరింత పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.280 పెరిగి రూ.1,01,680కు చేరింది. ఇది ఇటీవల కాలంలోనే తొలిసారి రూ.లక్ష మార్క్‌ను దాటి వెళ్లిన ధరగా నమోదైంది.

Today Gold Price : నాల్గు రోజుల్లో రూ. 4 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఎంత ఉందంటే..!!
Today Gold Price : నాల్గు రోజుల్లో బంగారం ఎంత పెరిగిందో తెలిస్తే షాక్ అవుతారు
అలాగే 22 క్యారెట్ల బంగారం కూడా పెరుగుతోంది. ఈరోజు 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.93,200కు చేరుకుంది. ఈ రేట్లు సాధారణ వినియోగదారులపై ప్రభావం చూపించనున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల దృష్ట్యా బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతున్న వేళ, ధరలు పెరగడం భవిష్యత్తులో మరింత భారంగా మారే అవకాశం ఉంది.
ఇక వెండి ధరలూ అదే దారిలో సాగుతున్నాయి. ఈరోజు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,100కు చేరింది. ఇది వెండి ధరలో చారిత్రాత్మక స్థాయిలో పెరుగుదలగా పరిగణించబడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరగడంతో పాటు డాలర్ మారకం రేట్లు, ముడి చమురు ధరల్లో ఉన్న అస్థిరత వంటి అంశాలే దేశీయ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.