Today Gold Rate : ఈరోజు ఏకంగా రూ. 2 వేలు తగ్గిన బంగారం ధర..!
ప్రధానాంశాలు:
Today Gold Rate : ఈరోజు ఏకంగా రూ. 2 వేలు తగ్గిన బంగారం ధర..!
Today Gold Rate : బంగారం ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు (మే 1) 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2,180 తగ్గి రూ.95,730కి చేరింది. ఇదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.2,000 తగ్గి రూ.87,750 వద్ద కొనసాగుతోంది. ఈ ధరల తగ్గుదల బులిటెన్ మార్కెట్‌లో కీలకమైన మార్పులు, అంతర్జాతీయ బంగారానికి డిమాండ్ తగ్గుదల, డాలర్ బలపడటం వంటి అంశాల ప్రభావంతోనే జరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.

Today Gold Rate : ఈరోజు ఏకంగా రూ. 2 వేలు తగ్గిన బంగారం ధర..!
అదే సమయంలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.1,08,900 వద్ద నమోదైంది. ఇదే ధరలు విజయవాడ, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా కనిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండడం తో వినియోగదారులు బంగారంపై ఆసక్తి చూపినా, ధరల తగ్గుదల వల్ల కొంతవరకు కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.
గత 9 రోజుల గడవులో బంగారం ధరలు స్థిరంగా క్షీణించడమే కాక, 10 గ్రాములకు రూ.5,620 వరకు తగ్గినట్లు గమనించవచ్చు. ఇది ఇటీవల కాలంలో నమోదైన అత్యంత గణనీయమైన తగ్గుదలగా చెప్పుకోవచ్చు. అటు అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గుతుండటం, లోకల్ మార్కెట్లలో పెట్టుబడిదారుల సంకోచం కూడా ఈ ధరల క్షీణతకు కారణమవుతున్నాయి. ఈ తరహా పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు సరైన సమయాన్ని ఎంచుకోవడం మేలంటున్నారు.