Organic Farming : వ్యవసాయం చేస్తూ నెలకు కోట్లు సంపాదిస్తున్న అన్నదమ్ములు.. వీడియో
ప్రధానాంశాలు:
Organic Farming : వ్యవసాయం చేస్తూ నెలకు కోట్లు సంపాదిస్తున్న అన్నదమ్ములు.. వీడియో
Organic Farming : కరోనా సమయంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. కొందరు తమ సొంత ఊళ్లకు వెళ్లి వ్యవసాయం చేస్తూ జీవనాన్ని గడుపుతున్నారు. ఇలాగే పూణేకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కరోనా సమయంలో ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తూ నెలకు కోట్లు ఆర్జిస్తున్నారు. సత్యజిత్ హోంగే, అజిక్యా హోంగే అనే ఇద్దరు అన్నదమ్ములు టు బ్రదర్స్ ఆర్గానిక్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ఇప్పుడు సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. తమ్ముడు అజిక్యా హోంగే కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పొందాడు. పూణేలో ని ఇందిరా కాలేజీలో ఎంబీఏ చేశాడు. బ్యాంకింగ్ రంగంలో సుమారు నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. అన్నయ్య సత్యజిత్ ఎంబీఏ పూర్తి చేసి కొన్నేళ్లు బ్యాంకింగ్ లోనే పనిచేశారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ పొలంలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. టు బ్రదర్స్ ఆర్గానిక్ సంస్థ సహజ పద్ధతుల ద్వారా సాంప్రదాయ భారతీయ ఆహార పంటలను పండిస్తుంది ప్రస్తుతం లడ్డూలు నెయ్యి పీనట్ బట్టర్ గ్రౌండ్ ఆయిల్ వంటి సహా అనేక రకాల సేంద్రియ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వ్యవసాయంలో భిన్నమైన ఆలోచనలు అలవాటు చేసుకుని విజయం సాధించవచ్చు అనడానికి ఈ సోదరులు ఇద్దరు చక్కటి ఉదాహరణ. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి ఇప్పుడు అక్షరాలు నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. పూణేలోని హోదాని గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు బ్యాంకులో ఉద్యోగాలను వదిలి తమ సొంత ఊరిలో ఉన్న పొలంలో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
సంప్రదాయ పద్ధతిలో కేవలం సహజ వనరులను ఉపయోగించి వ్యవసాయం చేయడానికి సేంద్రియ వ్యవసాయం అంటారు. ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులు , పురుగుల మందులు, కలుపు మందులు వాడకూడదు. రసాయన ఎరువులు వాడటం వలన అధిక రాబడి వచ్చిన భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వస్తాయి. ఇప్పటికే గాలి, నీరు, తినే తిండి కలుషితం అయి అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. భూసారాన్ని పెంచే వానపాములు అంతరించిపోయే స్టేజిలో ఉన్నాయి. తేనెటీగలు కూడా పెద్ద మొత్తంలో చనిపోతున్నాయని గణాంకాలు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కొందరు రైతులు ప్రజలకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ తక్కువ ధరలకే అమ్ముతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయంలో దిగుబడులు తక్కువ వచ్చిన ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది.