Shiva Mukkoti : ఈరోజు శివ ముక్కోటి.. ఈ కథ వింటే మీ ఇంట్లో ఐశ్వర్యమే ఐశ్వర్యం.. ఈ పూజ చేస్తే కావాల్సినంత పుణ్యం వస్తుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shiva Mukkoti : ఈరోజు శివ ముక్కోటి.. ఈ కథ వింటే మీ ఇంట్లో ఐశ్వర్యమే ఐశ్వర్యం.. ఈ పూజ చేస్తే కావాల్సినంత పుణ్యం వస్తుంది

Shiva Mukkoti : ఇవాళ అంటే డిసెంబర్ 10న శివ ముక్కోటి. ప్రతి ఒక్కరిని కాపాడేది శివుడు మాత్రమే. అందుకే శివుడి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో వచ్చే రోజు. ఆ రోజున శివుడికి శివాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. శివ ముక్కోటి రోజు శివకేశవులను దర్శిస్తే సంతృప్తి కలుగుతుంది. శివుడికి నాటు ఆవు నెయ్యితో తెల్లవారుజామున అభిషేకం చేయాలి. ఆరోగ్యం కోసం అయితే మృత్యుంజయ స్తోత్రం, ఐశ్వర్యం కోసం అయితే శివ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :10 December 2022,6:00 am

Shiva Mukkoti : ఇవాళ అంటే డిసెంబర్ 10న శివ ముక్కోటి. ప్రతి ఒక్కరిని కాపాడేది శివుడు మాత్రమే. అందుకే శివుడి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో వచ్చే రోజు. ఆ రోజున శివుడికి శివాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. శివ ముక్కోటి రోజు శివకేశవులను దర్శిస్తే సంతృప్తి కలుగుతుంది. శివుడికి నాటు ఆవు నెయ్యితో తెల్లవారుజామున అభిషేకం చేయాలి. ఆరోగ్యం కోసం అయితే మృత్యుంజయ స్తోత్రం, ఐశ్వర్యం కోసం అయితే శివ పంచాక్షరితో చేయొచ్చు. వివాహం జరగాలంటే పాశుపద మంత్రంలో చేయాలి.

ఏమైనా కష్టాలు వస్తే మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున నాటు ఆవు నెయ్యితో అభిషేకం చేయాల్సి ఉంటుంది. పువ్వులతో శివలింగాన్ని తయారు చేసి అర్చన చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చేయాలి. ఆ తర్వాత ఆ పాత్రను దానం చేయాలి. జన్మరాశి బట్టి ఈశ్వరుడిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలిగిపోవాలంటే జన్మరాశిని బట్టి శివుడికి ప్రత్యేకమైన అభిషేకం చేయాలి.

10 december 2022 is a shiva mukkoti pooja benefits

10 december 2022 is a shiva mukkoti pooja benefits

Shiva Mukkoti : నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చేయాలి

శివుడికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అన్ని రకాల రాశుల వారు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆవు పెరుగుతో, తెల్ల జల్లేడు పూలతో అభిషేకం చేయొచ్చు. ఎర్రటి మందార పూలతో పూజించాలి. గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని కూడా శివుడికి సమర్పించవచ్చు. హిందూ పురాణాల ప్రకారం శివుడిని భక్తిశ్రద్ధలతో కొలవాలి. శివుడిని లింగ రూపంలో పూజించాలి. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వచ్చే డిసెంబర్ 10న ఖచ్చితంగా శివుడికి పై పూజలు చేసి ఐశ్వర్యాన్ని పొందండి.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది