Brahmam Gari kalagnanam : బ్రహ్మంగారి కాలజ్ఞానం .. 2024లో జరగబోయే విధ్వంసం ఇదే ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Brahmam Gari kalagnanam : బ్రహ్మంగారి కాలజ్ఞానం .. 2024లో జరగబోయే విధ్వంసం ఇదే ..!!

Brahmam Gari kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే మారాయి. అయితే క్రీస్తు శకం 1608 లో బ్రహ్మంగారు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తులను ముందుగానే చెప్పారు. తండ్రి మరణించిన తర్వాత బ్రహ్మంగారు తల్లి అనుమతితో వర బ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పి ఇంటిని వదిలి వెళ్లిపోయారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 September 2023,12:00 pm

Brahmam Gari kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే మారాయి. అయితే క్రీస్తు శకం 1608 లో బ్రహ్మంగారు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తులను ముందుగానే చెప్పారు. తండ్రి మరణించిన తర్వాత బ్రహ్మంగారు తల్లి అనుమతితో వర బ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పి ఇంటిని వదిలి వెళ్లిపోయారు. అలా వెళ్ళిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్రించాడు.

మరుసటి రోజు ఉదయం ఎవరు నీవు అని అడగగా బ్రతుకుతెరువు కోసం వచ్చాను, ఏదైనా పని ఉంటే చెప్పండి అనగా అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులను తోలుకు వెళ్ళమని చెప్పగా బ్రహ్మంగారు గోవుల కాపరిగా మారారు. అక్కడ ఉన్న తాటి చెట్టు ఆకులను కోసుకొని కొండ గుహలో కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టారు. అయితే ఆయన కాలజ్ఞానాన్ని ఒకచోట పాతిపెట్టారు. అక్కడ చింత చెట్టు, మొలిసింది. మరి ఆయన అలా ఎందుకు పాతిపెట్టారో ఎవరికీ తెలియదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుబడుతుందని చెప్పారు.

2024 Brahmam Gari kalagnanam

Brahmam Gari kalagnanam : బ్రహ్మంగారి కాలజ్ఞానం .. 2024లో జరగబోయే విధ్వంసం ఇదే ..!!

ఆయన చెప్పిన విధంగా 1910 నుంచి 12 వరకు తీవ్రంగా వరదలు రావడంతో కలరా వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవరు వెళ్లలేదు. ఇంకా భవిష్యత్తులో జరగబోయే వాటిల్లో కనకదుర్గమ్మ ముక్కుపుడకను గంగా నది తాకుతుందని చెప్పారు. జలప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణా నదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే అవకాశం ఉంది. మనుషుల్లో కోపం పెరిగి, వావి వరుసలు మరిచి, ఒకరిని ఒకరు చంపుకుంటారు. ఇక దారుణమైన పరిస్థితులు ఉంటాయి. కొత్త రోగాలు, వైరస్లు మనుషులను అతలాకుతలం చేయనున్నాయి. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రిందట బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది