Brahmam Gari Kalagnanam 2024 : బ్రహ్మం గారి కాలజ్ఞాన ప్రకారం 2024లో జరిగేవి ఇవే…!
Brahmam Gari Kalagnanam 2024 : ప్రపంచంలో ఏ మూలన ఏ వింత సంఘటన జరిగిన ఇదిగో బ్రహ్మంగారి ఇవన్నీ ఎప్పుడో చెప్పారు. అంతా ఆయన చెప్పినట్లుగానే జరుగుతున్నాయి అని అందరూ అనుకోవటం మనం వింటూనే ఉంటాం. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తన మనో నేత్రంతో దర్శించిన బ్రహ్మంగారు రవ్వల కొండలో ఒక గుహలో కూర్చొని కాలజ్ఞానాన్ని రచించాడు. బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞానం కొంతమేర లబ్యమైన, ఆయన రచించిన మిగతా కొన్ని తాళపత్రాలు మాత్రం ఇప్పటికీ కూడా రహస్యంగానే ఉన్నాయంట. వీటిలో రాబోయే సంవత్సరంలో ఎప్పుడు ఏమీ జరగబోతుంది అనే విషయాలు పుసగుచ్చినట్లుగా వివరించారంట. మరి ఉగాదితో ప్రారంభమయ్యే క్రోధినామ సంవత్సరంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయే. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
క్రోధినామ సంవత్సరం తన పేరుకు తగ్గట్టే తన క్రోధాన్ని ప్రజల మీద చూపించబోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. 2024 సంవత్సరం మధ్య భాగం నుండి మన భారతదేశం తో పాటు ప్రపంచ దేశాలలో ఎవరు ఊహించని, కనీవినీ ఎరుగని సంఘటనలు జరుగుతాయట. ఇప్పటికే అనేక దేశాల మధ్య యుద్ధాలతో అట్టుడికి పోతున్న ప్రపంచం ఈ ఉగాది తరువాత మరింతగా యుద్ధాల వలన నష్టపోతుందంట. దీనివలన తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం తో పాటు నిత్య అవసరాల ధరలు కొండెక్కి సామాన్యులు బ్రతకలేక ఆకలి కేకలు వేస్తాడట. ఈ సమయంలోనే ఒక పెద్ద దేశం జీవ రసాయనాల ఆయుధాలను వినియోగిస్తుందట. దాని ప్రభావం వలన ప్రపంచం మొత్తం కొత్త వ్యాధి ఉద్భవించి దారాళంగా వ్యాపించి అనేక మందిని బలి తీసుకోబోతుందం ట.
ఇక 2024 మధ్య భాగంలో అనగా జూన్, జూలై నెలలో బంగాళాఖాతంలో భయంకరమైన తుఫాను ఒకటి ఏర్పడుతుందంట. దీని ప్రభావం వలన భారతదేశంతో పాటు తీర ప్రాంత దేశాలన్నీ చిగురుటాకుల అల్లాడిపోతాయట.ఈ సమయంలోనే ఈశాన్య దేశాల లో భూకంపం సంభవించి అనేక మంది ప్రజలను బలి తీసుకుపోతుందంట. రాబోయే మే నెలలో ఉన్నట్టుండి సూర్యుడు లో సౌర తుఫాన్ చెలరేగి భూమి వైపు దూసుకొస్తుందట. దీని ప్రభావం వలన సమాచార వ్యవస్థ మొత్తం కూడా కుప్ప కూలిపోతుందంట. ఇక 2024 సంవత్సరంలో క్యాన్సర్, అల్జీమర్స్ కి మందు కనిపెడతారట. బంగారం ధర నానాటికి పైకి వెళుతూ ధనవంతులు కూడా కొనలేని స్థాయికి చేరుకుంటుందట. స్త్రీ, పురుషులలో కామవాంఛలు చెలరేగి వావి వరసలతో సంబంధం లేకుండా అనైతిక సంబంధాలు పెట్టుకుంటారట.
ఏప్రిల్ తరువాత దేశంలో ఎవరూ ఊహించని రాజకీయ పరిణామాలు సంభవిస్తాయట. పెనుగండ లో పులులు తిరుగుతాయట. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుందట. భార్యలను భర్తలు,భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట. వన్య మృగాలు అడవులను వదిలి నగరాలలో చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తాయట. ఆకాశం నుండి రెండు బంగారు హంసలు పుట్టి ఊరు,వడ సంచరిస్తూ ఉంటాయంట. అత్యాశతో వీటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన వారు ఎందరో మరణిస్తారట. భారతదేశానికి ఈశాన్య న కాకులు దూరని కారడవిలో వింత వెలుగు ఒకటి పుడుతుంది అంట. అది క్రమ క్రమంగా ఆకాశం అంతా కూడా వ్యాపించి ఒక్కసారిగా మాయమవుతుందంట. ఈ వింత వెలుగును చూసిన ఎంతోమంది ప్రజలు నెత్తురు కక్కుకొని చచ్చిపోతారంట. వింధ్య పర్వతాల నుండి చిత్ర విచిత్ర శబ్దాలు వస్తాయట. ఆకాశంలో పొగ మంటలు పుట్టి అవి దేశ దేశాలకు దారాళంగా వ్యాపిస్తుందట.
దీనిలో చిక్కుకొని అనేక మంది ప్రజలు మరణిస్తారట. వేప చెట్టుకు అమృతం కురుస్తుందంట. ఆలయాల్లో అపారమైన నిధి,నిక్షేపాలు బయటపడతాయట. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి సంపద మొత్తాన్ని ఆరుగురు గజ దొంగలు దోచుకొని తింటారట. దీంతో స్వామివారి కుడి భుజం ఒక్కసారిగా అదరడం మొదలు పెడుతుందట. ఇది జరిగింది మొదలు దేశంలో అనేక ఉత్పాతాలు సంభవిస్తాయట. కోపంతో మల్లికార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడట. ఆకాశం నుండి లెక్కకు మించి పిడుగులు పడి తీవ్ర ఆస్తి,ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయట. ముండ మోపులు ముత్తైదులు అవుతారట. బొడ్డు కూడా కొయ్యని బిడ్డలు గట్టిగా మాట్లాడతారట. పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడట. కంచి కామాక్షమ్మ కళ్లెరచేస్తుందంట. దుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణమ్మ అందుకుంటుందట. శ్రీశైల శిఖరాన అగ్ని వర్షం కురుస్తుందట. అది చూసిన నంది పెద్దగా రెంకెలు వేస్తుంది అంట.
ఈ కేకలు విన్న జనులు ఎంతోమంది మరణిస్తారంట. ప్రపంచ దేశాల మీద ఒకవైపు కరువు,మరోవైపు సునామీలు విరుచుకుపడతాయట. భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి కలిసి పోవడంతో మహానగరాలు మాయం అవుతాయట. యంత్రాలు మనుషులను తన చెప్పు చేతల్లో పెట్టుకుంటాయట. ఏడు సంవత్సరాలకే స్త్రీలు గర్భం దలుచుతారట. నానాటికి ధర్మం అనేది కట్టు తప్పుతుందట. ఆలయాల్లో పూజలు జరగక మూతపడతాయట. ఇలా కలిపురుషుడు ఆగడాలు మితిమీరినప్పుడు తాను వీర భోగ వసంత రాయులుగా వచ్చి దుష్ట శిక్షణ,శిష్ట రక్షణ చేస్తాను అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు…