Ayodhya Sriram Ram Gold : ఆ అయోధ్య రాముని బంగారం, వజ్రాభరణాలు గురించి మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ayodhya Sriram Ram Gold : ఆ అయోధ్య రాముని బంగారం, వజ్రాభరణాలు గురించి మీకు తెలుసా..?

 Authored By aruna | The Telugu News | Updated on :25 January 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Ayodhya Sriram Ram Gold : ఆ అయోధ్య రాముని బంగారం, వజ్రాభరణాలు గురించి మీకు తెలుసా..?

Ayodhya Sriram Ram Gold : Ayodhya Ram Mandir అయోధ్య రాముడు యొక్క బంగారు ఆభరణాలు వజ్రాలు ఏమున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే వాటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ కలియుగంలో తన పుట్టిన అయోధ్యలో కొలువు తీరటానికి 500 ఏళ్ళు పోరాటాలు చేస్తే కానీ కొలువు తీరలేదు. మొత్తం గా సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రస్థానం ప్రాణప్రతిష్టతో ముగిసింది. ఒక రకంగా ఈ కలియుగంలో జరిగిన అతిపెద్ద మహాక్రతువుగా దీన్ని అభివర్ణించాలి. అయోధ్య రామ మందిరం ప్రతిష్ట కార్యక్రమంలో దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు గ్రామ జన్మభూమి తీర్థాక్షేత్ర ట్రస్ట్ ప్రత్యేకంగా ఆహ్వానాలు పలికింది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిస్తుంది. ఒక్క శివుడు తప్ప అందరూ అలంకార ప్రియులే అది కూడా మామూలుగా కాదు ఏడు వారాల నగలు ధరిస్తారు.అందుకు అయోధ్య బాలరాముడు కూడా అతీతం కాదు.. మొత్తానికి భారతీయ హిందువులు అందరూ కూడా ఈ సమయంలో తృప్తి చెందారు అని చెప్పుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం స్థాపించడం అలాగే బాల రాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగటం అనేది భారతీయులందరూ కూడా తృప్తిపడే విషయం.. కళ్ళారా బాలరామున్ని చూసి అందరూ కూడా తరిలినంచారు.

బాలరాముడు సుందర దివ్యమూర్తి అందరిని విశేషంగా ఆకట్టుకుంది. అంతగా బాలరాముడి దివ్య రూపం ప్రతి ఒక్క హిందువుని మైమరిపింపజేసింది. ఆయన వేసుకున్న నగలు కూడా చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయి. అని అందరూ చర్చించుకుంటున్న ఈ సమయంలో అయోధ్యలో కొలువైన బాల రాముడు విగ్రహానికి 7వారాల నగలు ధరింపజేశారు. వాటి గురించిన వివరాలు చూద్దాం.. ఏడు గ్రహాలను అధిపతులుగా నిర్ణయించారు..ఇష్టమైన రత్నాలను కూడా నిర్ణయించారు. నవగ్రహాల అనుగ్రహం కావాలంటే వారికి ఇష్టమైన రత్నాలను ధరించాలని చెబుతారు. పూర్తిగా ఆడవారు ఇలాగే నగలను ధరించేవారు కూడా.. ఇప్పుడు బాల రాముడికి కూడా ఆఫ్రాకారమే నగలను చేయించారు. ఆదివారం సూర్యుడు దినానికి గుర్తు అయిన ఈ రోజున స్వామివారికి కెంపులతో కూడిన నగలను వేస్తారు. తల నుంచి కాళ్ల వరకు మొత్తం కెంపులతో చేసిన హారాలే ఉంటాయి.

సోమవారం రోజు ఇది చంద్ర దినం కాబట్టి చంద్రుడికి ముత్యాలంటే ఇష్టం. అందుకే ఈ రోజున బాల రామునికి ముత్యాల హారాలు ధరింప చేస్తారు. మంగళవారం కుజుడు ఈరోజుకు అధిపతి ఈయన అనుగ్రహం కోసం పగడాల గొలుసులు ఉంగరాలు ఉంటాయి. బుధవారం రోజుకు అధిపతి బుధుడు ఈరోజు పచ్చల పథకం పచ్చలు అమర్చిన గాజులు వేస్తారు. గురువారానికి అధిపతి దేవగురువు. బృహస్పతి ఈరోజున పుష్యరాగం ఉన్న కమ్మలు ఉంగరాలు బాల రాముడు ధరిస్తాడు. శుక్రవారం రోజు శుక్రుని వారమైన ఈరోజు రాములల్ల వజ్రాల హారాలు, వర్షపు ముక్కుపుడక , కమ్మలు వేసుకుంటారు. శనివారానికి అధిపతి శని భగవానుడు. ఆయన అతీతంగా నీలిమణి హారాలు ఆభరణాలను ధరిస్తాడు. ఆభరణాలను శ్రీ అంకుర్ ఆనంద్ సంస్థకు చెందిన హర్ష జ్యువెలర్స్ తయారు చేస్తుందని శ్రీరామ జన్మభూమి తెలిపింది. ఆధ్యాత్మి రామాయణం, వాల్మీకి రామాయణం, స్తోత్రం వంటి గ్రంథాలలో శ్రీరాముడి వైభవం ధరించిన దివ్య ఆభరణాల గురించి విస్తృతమైన అధ్యయనం చేసిన తర్వాత వీటిని తయారు చేయించామని చెప్తున్నారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది