Ayodhya Ram Mandir : శ్రీరాముని అసలైన వారసులు వీరే…ఇదిగో ప్రూప్…
ప్రధానాంశాలు:
Ayodhya Ram Mandir : శ్రీరాముని అసలైన వారసులు వీరే...ఇదిగో ప్రూప్...
Ayodhya Ram Mandir : ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య పేరే వినిపిస్తోంది కదా. దానికి గల కారణం ఎన్నో ఎలా సుదీర్ఘ పోరాటాల తర్వాత ఇప్పుడు శ్రీరాముని రామ మందిరం నిర్మించడమే. ఈనెల 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ సందర్భంగా శ్రీరాముల వారికి సంబంధించిన ఎన్నో వాస్తవాలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో ఒకటి లవకుశలు. అయితే లవకుశలు సీత రాముల కుమారులని అందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత లవకుశలు ఏమయ్యారు ఎక్కడికి వెళ్లారు. శ్రీరాముని వంశం ఇప్పటికీ ఇంకా ఉందా. శ్రీరాముని తర్వాత అయోధ్యను ఎవరెవరు పాలించారు. అయితే ఈ విషయాలు ఏమీ ఎవరికీ తెలియదు. అయితే శ్రీరాముడు లవకుశలకు పట్టాభిషేకం చేసిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలోని ప్రతి ఒక్కరికి రామాయణ కథ తెలుసనే చెప్పాలి. దానిలో ముఖ్యంగా రాముడు తండ్రి మాట కొరకై అడవులకు వెళ్లడం ఇక అక్కడ రావణుడు సీతాదేవిని ఎత్తుకుని వెళ్ళడం..
దీంతో రాముడు రావణుడితో యుద్ధం చేసి సీతాదేవిని తీసుకురావడం అనంతరం అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడైన తర్వాత సీతాదేవిని అనుమానించి మరల అడవులకు పంపడం. ఇక అక్కడ సీతాదేవి లవకుశ లకు జన్మనివ్వడం..ఆ తర్వాత నిజం తెలుసుకున్న రాముడు లవకుశ లను దగ్గరికి తీసుకొని పట్టాభిషేకం చేస్తాడు. అయితే ఇక్కడ వరకు రామాయణం అంతా అందరికీ తెలుసు కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. రాముని తర్వాత లవకుశలు రాజ్యాన్ని ఏలేరా లేదా సూర్యవంశం అయిన రాముని వంశం ఆ తర్వాత కొనసాగిందా లేదా అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు. అయితే శ్రీరాముడు అయోధ్య రాజ్యాన్ని వదిలి తన అవతారానికి ముగింపు పలకగా , కుషుడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని ఎలా సాగాడు. ఆ తర్వాత కుషుడు కుమ్ముద్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక వీరికి ఒక కుమారుడు జన్మించగా అతనికి అతిధి అనే నామకరణం చేశారు.
అనంతరం అతిథికి పెళ్లి కాగా ఆయనకు నిషాదుడు అనే కుమారుడు జన్మించాడు. ఇక నిషాధుడికి నరుడు అనే కుమారుడు జన్మించడం జరిగింది. అలా నరుడికి నవుడు అనే కుమారుడు జన్మించాడు. ఇలా శ్రీరాముని వారసులంతా రాజ్యపాలన చేపట్టారు. ఇక నవుడు తర్వాత కొన్ని తరాలకి బృహత్ బలుడు జన్మించాడు. అయితే బహుత్ బల్లుడు కుషుడు థర్వాత 50వ తరానికి చెందిన వాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక బృహత్ బలుడు మహాభారతం కాలానికి చెందిన వాడని నమ్మకం. నిజానికి శ్రీరాముడు వంశం అయిన బృహత్ బలుడు మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షన యుద్ధంలో పాల్గొన్నాడు. ఇక మహాభారతం కథ తెలిసిన వారందరికీ దానిలో బృహథ్ బలుడు పాత్ర ఏంటో తెలిసే ఉంటుంది. మహాభారత యుద్ధంలోనే బహుత్ బలుడు మరణించాడు.