kaliyugam Facts : కలియుగం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన 4సత్యాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

kaliyugam Facts : కలియుగం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన 4సత్యాలు ఇవే…!

 Authored By aruna | The Telugu News | Updated on :25 February 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  kaliyugam Facts : కలియుగం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన 4సత్యాలు ఇవే...!

kaliyugam Facts : కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు తిరిగి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఒక రోజు ధర్మరాజు లేని సమయంలో శ్రీకృష్ణుడు హస్తినపురానికి వస్తాడు. కృష్ణుడి రాకతో ఎంతో సంతోషించిన తక్కిన పాండవులు మాధువునికి అతిధి మర్యాదలు చేసి ఆసనం మీద కూర్చోబెట్టి సఫర్లు చేస్తూ గోవిందా త్వరలో ద్వాపరయుగ ముగియబోతోంది. తర్వాత రాబోయే కలియుగం ఎలా ఉండబోతుందో కొంచెం చెప్పమని అడుగుతారు. పాండవుల ప్రశ్నకు చిరునవ్వు నవ్విన శ్రీకృష్ణుడు. రాబోయే కలియుగం ఎలా ఉండబోతుందో మీ కళ్ళతో మీరే చూడండి. అని నాలుగు దిక్కులకు నాలుగు బాణాలు వదిలి మీ నలుగురు ఆ నాలుగు బాణాలను తీసుకురండి అని చెబుతారు.శ్రీకృష్ణుడు స్పందించిన బాణాల కోసం వెతుకుతున్న క్రమంలో అర్జునుడికి ముందుగా బాణం కనిపిస్తుంది. ఆ బాణం తీస్తుండగా వెనుక నుండి ఒక మధుర గానం వినిపిస్తుంది. దాంతో వెనక్కు తిరిగి అర్జునుడికి ఒక కోయిల తీయగా పాడుతూ తన కాళ్ళు కింద సజీవంగా ఉన్న కొందేలుని పొడుచుకు తింటూ కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసి అవాకైనా అర్జునుడు బాణం తీసుకుని పరుగున శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి నిశ్నేష్టుడై నిలబడతాడు. కాసేపటికి భీముడికి కూడా బాణం కనిపిస్తుంది.

చుట్టూ ఉన్న నాలుగు భావుల్లో నీరు పుష్కలంగా ఉండి పొంగిపొర్లుతున్న మధ్యలో ఉన్న బావి మాత్రం పూర్తిగా ఎండిపోయి కనిపిస్తుంది. ఇది చూసి నిర్ధాంత పోయిన భీముడు బాణం తీసుకుని కృష్ణుడి దగ్గరకు వచ్చేస్తాడు. మూడవ బాణాన్ని నక్లుడు గుర్తిస్తాడు. అక్కడ ఒక ఆవు అప్పుడే పుట్టిన దూడను దానిమీద ఉన్న వాత్సల్యంతో గాయాలయ్యే వరకు నాకుతూ ఉంటుంది. దూడకు గాయం పెద్దదైతుండడంతో అక్కడ ఉన్న వారంతా ఆ రెండిటిని విడదీస్తారు. ఇక సహదేవుడికి బాణం జరిగిన చోట మీద నుంచి బండరాయి దొర్లుకుంటూ వస్తూ మార్గం మధ్యలో అనేక చెట్లను పెకిలించి వేస్తుంది. చివరికి అది ఒక చిన్న మొక్కను ఆగిపోతుంది. ఈ దృశ్యాలను చూసిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుడితో దీనిలో ఉన్న మర్మం ఏమిటి అని చెప్పమని అడుగుతారు. పాండవుల మాటలు విన్న శ్రీకృష్ణుడు కలియుగంలో సాధువులు జ్ఞానులు కోకిల మాదిరిగా మధురంగా మాట్లాడుతూ కపుట నాటకంతో అమాయక భక్తులను కుందేలును పొడుచుకున్నట్లు హింసిస్తూ దోపిడీ చేస్తారు.

కలియుగంలో అన్ని నిండుగా ఉన్నా సంపన్నులు తమ పక్కనే ఉన్న పేదలకు పైసలు కూడా సహాయం చేయరు. ఆవు దూడలు గాయాలు అయ్యేవరకు ఎలా నాకిందో అలానే కలియుగంలో తల్లిదండ్రులు బిడ్డల మీద ఉన్న ప్రేమతో వారిని అతిగారాభం చేస్తూ వారి జీవితాన్ని నాశనం చేస్తారు. కలియుగంలో ప్రజలు బండరాయిలా దొర్లుకుంటూ తమ వినాశనం వైపు పరుగులు తీస్తారు. వీరిని బంధుమిత్రులు సంపద వంటివి ఏమీ రక్షించలేము. వారిని భగం నామం అనే చిన్న ముక్క తప్ప ఏది రక్షించ లేదు అని శ్రీకృష్ణుడు కలియుగం గురించిన సత్యాలను పాండవులకు చెప్తాడు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది