Kaliyugam : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కలియుగం చివరలో మనుషులు ఎలా ఉంటారో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kaliyugam : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కలియుగం చివరలో మనుషులు ఎలా ఉంటారో తెలుసా…?

Kaliyugam  : మన పురాణాల ప్రకారం యుగాలు నాలుగు. అవి సత్యయుగం, త్రేతా యుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగంగా పిలుస్తారు. ప్రతి యుగంలోనూ భగవంతుడు దుష్ట శిక్షణ. శిష్ట రక్షణ కొరకు ఒక్కో అవతారాన్ని ఎత్తుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు. యుగాల్లో చివరిదైనా కలుయుగం గురించి భాగవతం మరియు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో విపులంగా వర్ణించబడి ఉంది. కలియుగం ఎలా అంతరించిపోతుంది. యుగాంతంలో ఎలాంటి విపరీతాలు సంభవిస్తాయి. శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 February 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Kaliyugam : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కలియుగం చివరలో మనుషులు ఎలా ఉంటారో తెలుసా...?

Kaliyugam  : మన పురాణాల ప్రకారం యుగాలు నాలుగు. అవి సత్యయుగం, త్రేతా యుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగంగా పిలుస్తారు. ప్రతి యుగంలోనూ భగవంతుడు దుష్ట శిక్షణ. శిష్ట రక్షణ కొరకు ఒక్కో అవతారాన్ని ఎత్తుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు. యుగాల్లో చివరిదైనా కలుయుగం గురించి భాగవతం మరియు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో విపులంగా వర్ణించబడి ఉంది. కలియుగం ఎలా అంతరించిపోతుంది. యుగాంతంలో ఎలాంటి విపరీతాలు సంభవిస్తాయి. శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి కలిపురుషున్ని ఎలా సంహరిస్తాడు. ఇలా ప్రతిదీ ఈ గ్రంథాల్లో చెప్పబడింది. కలియుగాంతం చివర్లో ధర్మం పూర్తిగా క్షణిస్తుంది. డబ్బు అధికారం చుట్టూనే ప్రపంచం మొత్తం తిరుగుతుంది. మానవత్వం మంట కలిసి పోతుంది. డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. స్త్రీ పురుషులు వావి వరుసలు మరిచి పూర్తిగా కట్టు తప్పి ఇతరులతో విచ్చలవిడిగా సంఘమిస్తారు. వాతావరణ మార్పులతో మంచు కరిగిపోయి భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి జారిపోతుంది. అగ్నిపర్వతాలు ఉన్నట్టుండి బద్దలవుతాయి. అతివృష్టి, అనావృష్టిలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. నదులు ఇంకిపోయి తాగడానికి గుక్కెడు నీరు లేక జీవజలం ఒక్కొక్కటిగా అంతరించిపోతోంది. పాలకులు కన్ను మిన్ను కారక అరాచకంగా వ్యవహరిస్తుంటారు.

వర్గ వైశ్యామ్యాలు పెరిగి ఒకరినొకరు కొట్టుకు చస్తారు. దేశాల మధ్య ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటారు. ఆకాశము నుండి ఉన్నట్టుండి ముల్కలు రాలిపడతాయి. నక్షత్రాల వెలుగు తగ్గుతుంది. సూర్యచంద్రులు గతి తప్పుతారు. సూర్యుడు కొద్ది కొద్దిగా భూమి తమ వైపు లాక్కుంటూ సౌర తుఫానులతో విరుచుకుపడతాడు. ఆ సమయానికి భూమి మీద సగం జీవరాసి అంతరించిపోతుంది. ఇంకా ఈ భూమి మీద మిగిలి ఉన్న వారి ప్రవర్తన మరింత విపరీతంగా తయారవుతుంది. మనుషుల ఆయు ప్రమాణం 100 నుంచి 16 సంవత్సరాలకు పడిపోతుంది. ఆడవారు ఎనిమిది సంవత్సరాలకే గర్భం దాల్చితారు. మానవుల్లో దైవచింతన పూర్తిగా నశిస్తుంది. దేవుని నుంచి పూజలు జరగ దేవాలయాలు మీద ధర్మం గట్టు తప్పి ఆ ధర్మం వికృత నృత్యం చేస్తున్నప్పుడు దుష్టులను అంతం చేస్తే ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో హిమాలయాల్లో ఉన్న సంబల నగరంలో ఆవిర్భవించి దుష్ట శిక్షణ చేసి పుణ్యాత్ములను రక్షిస్తూ చివరిగా కలిపురుషుల్ని అంతం చేస్తారు. దానితో కలియుగం అంతంమవుతుంది. కలియుగం అంతమైనప్పుడు ఈ భూమి మీద పెద్ద ప్రళయ సంభవించి భూమి మొత్తం సముద్రంలో మునిగిపోతుంది.

ఆకాశ నుండి గ్రహ శకలాలు దాడి చేస్తాయి. సముద్రం మొత్తం కల్లోలంక మారుతుంది. ఇలా ఒక మహా యుద్ధం పూర్తవడంతో శ్రీమహావిష్ణువు మత్స అవతా రం ఎత్తి సముద్రంలో మునిగిపోయిన భూమిని వేదాలను కాపాడి సత్య యుగానికి బాటలు వేస్తాడు. దీంతో సత్యయుగం ప్రారంభమవుతుంది. సత్యం కలియుగానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు పూర్తి దయవ చింతనతో ఉంటూ తమ పని తాము చేస్తూ తోటి వారికి సహాయపడుతూ చాలా ఆనందంగా జీవనం గడుపుతారు. ఈ యుగంలోని వారికి తిండి, నీరు, బట్ట ,గూడు ఇలా వేటికీ లోటు ఉండదు. అందరికీ అన్ని పుష్కలంగా దొరుకుతాయి. ఈ యుగంలో మనుషుల సగటు ఆయుర్దాయం లక్ష సంవత్సరాలుగా ఉంటుంది. ఎత్తు 11 అడుగుల వరకు పెరుగుతారు. ఎండాకాలం చలికాలం అనేవి ఉండవు. కేవలం వానాకాలం మాత్రమే ఉంటుంది. వర్షాలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే కురుస్తాయి. క్రూర జంతువులు మనుషుల మధ్యలో తిరుగుతూ వారితో కలిసి

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది