Dreams : కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగం పట్టినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dreams : కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగం పట్టినట్లే…!

Dreams : సాధారణంగా ప్రతి ఒక్కరు నిద్రలో కలలు కంటారు. అయితే కలలో అనేక రకాల విషయాలను చూస్తారు. ఇంకా కొంతమంది అయితే జంతువులను పక్షులను వృక్షాలు వంటిని చూస్తారు. మరి కలలో జంతువులు కనిపిస్తే శుభప్రదం అని పురోహితులు చెబుతున్నారు. పాము , ఆవు మరియు ఇతర జంతువులు కలలో కనిపించడం మరియు వాటి అర్థాల గురించి స్వప్న శాస్త్రంలో వివరంగా పేర్కొన్నది. అందులో జంతువులు మీ కలలో కనిపిస్తే అది మీ అదృష్టమా లేదా […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Dreams : కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగం పట్టినట్లే...!

Dreams : సాధారణంగా ప్రతి ఒక్కరు నిద్రలో కలలు కంటారు. అయితే కలలో అనేక రకాల విషయాలను చూస్తారు. ఇంకా కొంతమంది అయితే జంతువులను పక్షులను వృక్షాలు వంటిని చూస్తారు. మరి కలలో జంతువులు కనిపిస్తే శుభప్రదం అని పురోహితులు చెబుతున్నారు. పాము , ఆవు మరియు ఇతర జంతువులు కలలో కనిపించడం మరియు వాటి అర్థాల గురించి స్వప్న శాస్త్రంలో వివరంగా పేర్కొన్నది. అందులో జంతువులు మీ కలలో కనిపిస్తే అది మీ అదృష్టమా లేదా దురదృష్టమా అనేది తెలియజేస్తుంది అని అర్థం. మరి అది ఎలానో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

– ఎవరి కలలోనైనా ఆవు కనిపిస్తే అది అదృష్టమని స్వప్న శాస్త్రం చెబుతుంది. అయితే హిందూ మతంలో గోవుకు ప్రత్యేకమైన విశిష్ట స్థానం ఉంటుంది. కాబట్టి ఆవును కలలో కనిపిస్తే అది శుభసూచకమని అంటారు. ముఖ్యంగా కలలో ఆవు కనిపిస్తే ఆ వ్యక్తిపై దేవుడు ఆశీసులు ఉంటుందని అర్థం. అలాగే వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుందని ఈ ఆవు కల అర్థం.

– స్వప్న శాస్త్రంలో పాము కలలో కనిపిస్తే అది శుభసూచికం అని చెబుతారు. అలాగే పాములలో నల్లపాముు కలలో కనిపిస్తే అది అదృష్టానికి సూచకం అని అర్థం. వీరికి రానున్న రోజుల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వీరి ప్రతి కోరిక నెరవేరుతుందని ఈ కల అర్దం.

– స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరి కలలోనైనా ఏనుగుని చూసిన వ్యక్తికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అలాగే సంపద పెరుగుతుందని ఈ కల అర్థం. మరియు అతని జీవితంలో ఆనందం శ్రేయస్సుని పొందుతాడని ఈ కల సూచకం.

– అదేవిధంగా కలలో తెల్లటి సింహం కనిపిస్తే అది శుభప్రదం. కలలో తెల్ల సింహంని చూస్తే భవిష్యత్తులో పురోగతిని పొందుతారని అర్థం. అంతేకాదు కుటుంబ మరియు సామాజిక జీవితంలో విజయం సాధిస్తారు. అయితే జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఆత్మవిశ్వాసంతో పరిష్కరిస్తారని అర్ధం చేసుకోవాలి. ప్రమాదాలు ఎదురైనప్పుడు ధైర్యంగా వాటిని దాటతారని అర్థం.

Dreams కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగం పట్టినట్లే

Dreams : కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగం పట్టినట్లే…!

– ఎవరి కలలోనైనా గుడ్లగూబ కనిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో సంపద పెరుగుతుందని సూచకం. అలాగే కలలో గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అని కలల శాస్త్రంలో పేర్కొన్నది.

– స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరి కలలోనైనా కుందేలు కనిపిస్తే అది మంచి సంకేతం. ముఖ్యంగా వీరి జీవితంలో ప్రేమ పెరుగుతుంది. అలాగే చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది