Pichukalu : మీ ఇంట్లోకి పిచ్చుకలు పదేపదే వస్తున్నాయా..? అలా ఎందుకు వస్తున్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pichukalu : మీ ఇంట్లోకి పిచ్చుకలు పదేపదే వస్తున్నాయా..? అలా ఎందుకు వస్తున్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!!

 Authored By ramu | The Telugu News | Updated on :27 March 2024,7:00 am

Pichukalu : ఇట్లు కి ఏ పక్షులు ప్రవేశిస్తే లక్ష్మీప్రదం ఎలాంటి పక్షులు వస్తే ఆ శుభం కలుగుతుంది. ఈ విషయాలు గురించి చాలామందికి పెద్దగా తెలియదు. పక్షులు, కీటకాలు ప్రకృతిలో మమేకమై ఉంటాయి. మన జీవితంలో రాబోయే మార్పులు గురించి అవి ముందుగానే పసిగట్టి మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటాయి. అయితే మన బిజీ లైఫ్ లో పడి వాటిని మనం పట్టించుకోము. పక్షులు వాటి కదలికల గురించి శకున శాస్త్రంలో విపులంగా చెప్పబడింది. మన పెద్దవారు వాటి కదలికల ద్వారా వారి జీవితంలో సంభవించే మార్పులను ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మెసులుకునేవారు. పిచ్చుకలను శుభప్రదంగా మన శాస్త్రాల్లో చెప్పబడింది.అందుకే మన పెద్దవారు ఇంటిదగ్గర ధాన్యం కంకులు కట్టి మరీ వాటిని మచ్చగా చేసుకునేవారు.

పిచ్చుకలు మీ ఇంటికి పదే పదే వస్తుంటే మీ ఇంట్లో త్వరలో శుభకార్యం జరగబోతుందని అర్థమట. అలాగే మీ ఇంట్లో కొత్త దంపతులు ఉంటే వారికి త్వరలో సంతానం కలగబోతుందని విషయాన్ని కూడా ఈ జంట పిచ్చుకలు చెబుతాయట. అలానే అవి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే ఎంతో మంచిదట. పిచ్చుకలు మీ ఇంటి పరిసరాల్లో గూడును కట్టుకుని పిల్లలను పెడితే మీ ఇంట్లో ఇకనుండి ధనానికి కరువు ఉండదని సంకేతమట. అలానే చాలామంది గుడ్లగూబని చూడగానే చాలా భయపడుతూ ఉంటారు. గుడ్లగూబ అరుపులు విన్న అవి ఇంట్లోకి వచ్చిన ఏదో జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు. అయితే గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. గుడ్లగూబ మీ ఇంట్లోకి ప్రవేశించింది అంటే మీకు త్వరలో లక్ష్మీ కటాక్షం కలగబోతుందని విషయాన్ని అర్థం చేసుకోవాలట. అలాగే కాకి ఇంటి ముందు వాలితే దాన్ని మనం వెళ్ళగొడుతూ ఉంటాం.

కానీ అలా ఎప్పుడూ చేయకూడదట. కాకిని మన పితృదేవతలకు ప్రతినిధిగా చెబుతారు. మనం కాకికి పెట్టే ఆహారం పైన ఉన్న మన పితృదేవతలకు చేరుతుంది. మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దానికి కొంచెం అన్నం పెట్టి ఆదరించాలి. కానీ వెళ్ళగొట్టకూడదు అలానే కందిరీగలు మీ ఇంట్లో గూడు కట్టుకున్న శుభసూచకమేనట. అలానే మీకు మీ ఇంటి దగ్గర పదేపదే రామచిలుకలు కనిపిస్తూ ఉంటే మీ ప్రార్ధనలు అన్ని ఫలించి త్వరలోనే మీకు మంచి జరగబోతుందని అర్థమట. రామచిలక అమ్మవారి కి సంకేతం. రామచిలుక మీ ఇంట్లోకి వస్తుంటే అమ్మవారి కృప మీ ఇంటి మీద ఉన్నట్టే భావించాలి. గబ్బిలాన్ని అశుభానికి సంకేతంగా శకున శాస్త్రం చెబుతుంది. గబ్బిలం సాధారణంగా అందరూ తిరిగి ఇంట్లోనికి ప్రవేశించవు. ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే దానికి ఎటువంటి హాని చేయకుండా బయటకు వెళ్ళగొట్టి ఇల్లంతా పసుపు నీళ్లను జల్లుకోవాలని ఇలా చేస్తే ఆ దోషం అనేది పోతుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది