Sparrows : ఇంట్లోకి ఊరికే పిచ్చుకలు వస్తున్నాయా? అయితే జరగబోయేది ఇదే..
Sparrows : ఒకప్పుడు పిచ్చుకలు చాలా ఎక్కువగా కనిపించేవి. గ్రామాల్లో అయితే వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సార్లు పలు రకాల పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తుంటాయి. దీని వల్ల ఏదైనా హాని కలుగుతుందేమోనని చాలా మంది భయపడుతుంటారు. పిచ్చుకలు ఇళ్లలోకి వస్తే మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇక అవి జంటగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో పెళ్లి జరగబోతున్నదని అర్థం. పెళ్లి జరిగిన వారు ఉంటే వారికి సంతానం కలగబోతున్నదని అర్థం. ఇక కాకి మన ఇంట్లోకి వస్తే దానిని అశుభంగా భావించొద్దు.
మన పితృదేవతలు కాకి రూపంలో వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్టు భావించాలి. ఇక కాకి మన తలపై తన్నితే దాని వల్ల ఏదో అశుభం జరగబోతుందని సూచన. ఇక ఇంట్లోకి గుడ్లగూబ వచ్చిందంటే లక్ష్మియోగం పట్టబోతుందని అర్థం.ఇక ఇంట్లోకి పాములు వచ్చి దూలాలపై ఉంటే ఆ ఇంట్లో వ్యక్తులకు మానసిక వ్యథ తప్పదని అర్థం. కందిరీగలు ఇంట్లో గూడు కట్టుకోవడం మంచిదట. ధనయోగం ఉంటుందని అర్థం. బల్లలు ఇంట్లో ఉండటం వాస్తు పరంగా చాలా మంచిది. వర్షాకాలంలో మిడతలు ఇంట్లోకి వస్తుంటాయి. ఇవి ఇలా ఇంట్లోకి రావడం మంచిదేనట.
Sparrows : పాములు వస్తే ఎలా…?
ఎక్కువగా పొలాల్లో ఉండే ఈ మిడతలు ఇంట్లోకి వస్తే ఏదో మంచి జరగబోతున్నదని అర్థం. తేలు, జర్రిలు ఇంట్లో వస్తే శుభం కాదట. సీతా కోకలను చూస్తుంటే మనసుకు చాలా సంతోషంగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇక చిన్న పిల్లలు అయితే వీటిని పట్టుకునేందుకు చాలా ట్రై చేస్తుంటారు. ఇవి ఇంట్లోకి వస్తే ధనయోగం వస్తుందని అర్థం. ధనయోగం అంటే డబ్బులు మాత్రమే కాదు. మానసిక ప్రశాంతత, ఆహ్లాదంగా ఉండటం అని కూడా భావించాలి. అలాంటప్పుడు మనం సంతోషంగా ఉంటే ఎదుటి వారిని సైతం ఆనందంగా ఉంచేందుకు ట్రై చేస్తాం.