King Cobra : వేసవి తాపానికి అల్లాడిన కింగ్ కోబ్రా.. వ్యక్తి ఏం చేశాడో చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

King Cobra : వేసవి తాపానికి అల్లాడిన కింగ్ కోబ్రా.. వ్యక్తి ఏం చేశాడో చూడండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 March 2024,9:00 pm

King Cobra : పాములు అంటే ఎవరికైనా భయం వేస్తుంది. సరదాగా పాము వచ్చింది అని చెబితేనే ఎగిరి గంతేసి భయపడుతుంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న భయంకరమైన వాటిలో పాము కూడా ఒకటి. అది కాటేసిందంటే ప్రాణాలు హరి అంటాయంతే. అందుకే పాములకు ఎవరైనా భయపడిపోతుంటారు. అయితే పాముల్లో కూడా చాలా ప్రమాదకరమైనవి అనేకం ఉన్నాయి. కొన్ని హాని చేయనివి కూడా ఉంటాయి. కానీ ఏదేమైనా పాములు అంటేనే మనుషులకు భయం వేస్తుంది. కానీ కొందరు మాత్రం పాములకు అస్సలు భయపడరు. పైగా వాటితో స్నేహం చేస్తుంటారు. ఇంకొందరు అయితే ఎలాంటి భయం లేకుండా పాములను చేతిలో పట్టుకుని ఆడిస్తుంటారు. ఇలా పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంటాయి.

ఒకప్పుడు పాములు అంటేనే భయపడిపోయే వాల్లు ఇప్పుడు పాములతో వీడియోలు చేసే స్థాయికి వచ్చేశారు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎక్కవుగా ఇలాంటి పాముల వీడియోలను చూస్తూనే ఉన్నాం. కొందరు అమ్మాయిలు కూడా పాములను పట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి పాముల వీడియోలకు బాగానే వ్యూస్, లైకులు వస్తున్నాయి. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులోనూ అది కింగ్ కోబ్రా. ఈ పాము ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది గానీ కాటేసిందంటే క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

అది మన గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఎక్కడా కనిపించదు. కానీ ఇప్పుడు ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు చాలా దగ్గరగా వెళ్లాడు. అసలే వేసవికాబట్టి ఆ కింగ్ కోబ్రా వేడికి తట్టుకోలేకపోయినట్టుంది. ఓ ఇంటి వద్దకు వచ్చింది. ఇంతలోనే అక్కడున్న ఓ వ్యక్తి ఆ పామును చూసి బెదిరిపోలేదు. దానికి సాయం చేయాలనుకున్నాడు. వెంటనే దాని మీదనీళ్లు పోశాడు. ఆ పాము కూడా కదలకుండా అతనికి సహకరించింది. అతను దాని వేడితాపాన్ని తగ్గించేందుకు బాగానే శ్రమించాడు. అయితే ఆ పామును అతనుముట్టుకున్నా సరే అది ఏమీ అనలేదు. తనకు సాయం చేశాడనే కృతజ్ఞతతో అది ఏమీ అనలేకపోయింది. దాంతో ఆ పాము వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది