Sandals : ఈ దిక్కున చెప్పులు పెడుతున్నారా… అయితే మిమ్మల్ని దరిద్రం పట్టినట్లే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sandals : ఈ దిక్కున చెప్పులు పెడుతున్నారా… అయితే మిమ్మల్ని దరిద్రం పట్టినట్లే…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 February 2023,10:00 am

Sandals : సహజంగా ఇంట్లో చెప్పుల్ని ఎక్కడపడితే అక్కడ వదులుతూ ఉంటారు. అయితే ఈ చెప్పులను ఈ దిక్కున పెట్టినట్లయితే మీకు దరిద్రం పట్టుకున్నట్లే అని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.. వాస్తు కేవలం ఇంటి నిర్మాణమే మాత్రమే కాకుండా ఇంటి అమరిక లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అని వాటిని కూడా సూసిస్తూ ఉంటుంది. ఇంటికి సంబంధించిన చిన్న విషయం నుంచి అతిపెద్ద విషయం వరకు ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని రూపొందించిన శాస్త్రం కావున వాస్తుని పాటించడం వలన లాభమే తప్ప నష్టం అనేది జరగదు.. చిన్న చిన్న వాస్తు చిట్కాలను పట్టించుకోవడం వలన ఇంట్లో నివసించే వ్యక్తులు పెద్ద మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఆ విధంగా నిర్లక్ష్యం చేసే విషయాలలో చెప్పులు పెట్టుకునే ప్రదేశం కూడా ఒకటి. చెప్పులు ఉండాల్సిన చోట ఉండకపోతే దరిద్రం వెంటాడుతుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

Are you putting sandals in this direction

Are you putting sandals in this direction

అదృష్టం ఎప్పుడు మన వెంట ఉంచుకోవాలనుకుంటే తప్పకుండా చెప్పులు స్టాండ్ కు సంబంధించిన వాస్తు నియమాలను తెలుసుకోవడం చాలా మంచిది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. చెప్పులు ఎప్పుడు చిందరవందరగా ఉంచకూడదు. ఇలా చెప్పులు చిందరవందరంగా పడేస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు వస్తాయి. తూర్పు ఉత్తర దిక్కులు శాస్త్రం పవిత్రంగా భావిస్తారు. ఈ దిక్కులు దేవుడికి నెలవులని నమ్ముతూ ఉంటారు. కనుక అటువైపు చెప్పులు అసలు పెట్టకూడదు. ఈ దిక్కున చెప్పులు పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. ఇంటి ముఖ ద్వారం చాలా పవిత్రమైంది. ఇక్కడి నుంచి ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. కావున తప్పనిసరిగా ముఖద్వారం పరిసరాలు శుభ్రంగా అందంగా ఉండేలా చేసుకోవాలి. ఇంటి గుమ్మం లక్ష్మీ స్వరూపంగా కొలుస్తూ ఉంటారు.

కావున ముఖద్వారం వద్ద చెప్పులు షూ రాక్ పెట్టుకోవడం అసలు మంచిది కాదు. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి అలిగి వెనక్కి వెళ్ళిపోతుందని నమ్ముతుంటారు. కావున ముఖ ద్వారం ముందు చెప్పులు అసలు వదలకూడదు.. డబ్బు, నగలు దాచుకునే అల్మారా లేదా బీరువా లేదా కబోర్డును చాలా పరిశుభ్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ బీరువాలు అల్మారాల కింద చెప్పులు అసలే పెట్టకూడదు. అసలు ఆ గదిలోకి చెప్పులతో వెళ్లడం అస్సలు మంచిది కాదు.. ఇలా చెప్పులు పెట్టాల్సిన చోటు చెప్పులు రాక్ పెట్టుకోవాల్సిన చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల ఇల్లు శుభ్రంగా అందంగా కనిపించడం మాత్రమే కాదు ఇంట్లో సుఖ శాంతులకు అడ్డంకులు రావు. కావున చెప్పులు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది..

Are you putting sandals in this direction

Are you putting sandals in this direction

ఇంట్లో ఎక్కడపడితే అక్కడ చెప్పులు పెట్టడం అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలి. అది మంచి అలవాటు కాదు. తప్పకుండా చెప్పులు కోసం షూ రాక్ చేయించుకోవాలి. అక్కడ మాత్రమే చెప్పులు వదలాలి. ఇంట్లో షూ రాక్ పెట్టుకోవడానికి సరి అయిన దిక్కు నైరుతి కావున అక్కడ మాత్రమే చెప్పులు వదలాలి. చిన్న పిల్లల్లో నివసించే కొందరు షూ రాక్ పెట్టుకునేందుకు సరైన చోటు లేకపోవడం వల్ల బెడ్ రూమ్ లో పెట్టుకుంటూ ఉంటారు. ఆ కుటుంబానికి హానికరం కలుగుతూ ఉంటుంది. అలా చేయడం వలన అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి. దాంపత్య జీవితం ప్రమాదంలో పడుతుంది. ఇంట్లో శాంతి కరువు అవుతుంది. కనుక చెప్పుల ర్యాక్ ఎప్పుడు కూడా బెడ్ రూమ్లో పెట్టకూడదు…

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది