Ashada Masam : ఆషాడ మాసంలో అత్తా కోడలు ఒకే గడపలో ఎందుకు ఉండకూడదో తెలుసా…!
Ashada Masam : మన తెలుగు మాసాలలో ఒకటి ఆషాడ మాసం. ఈ ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. అలాగే ఆషాడమాసం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అలాగే అదే ఆషాడమాసంలో అత్త కోడలు కూడా ఒకే ఇంట్లో ఉండకూడదు. ఈ సాంప్రదాయం మన పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుంది. అయితే ఈ సాంప్రదాయానికి కొన్ని కారణాలు […]
Ashada Masam : మన తెలుగు మాసాలలో ఒకటి ఆషాడ మాసం. ఈ ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. అలాగే ఆషాడమాసం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అలాగే అదే ఆషాడమాసంలో అత్త కోడలు కూడా ఒకే ఇంట్లో ఉండకూడదు. ఈ సాంప్రదాయం మన పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుంది. అయితే ఈ సాంప్రదాయానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయట. ఈ సాంప్రదాయానికి ఎందుకు ఇలా అత్తా కోడలను ఒకే గడపలో ఉంచకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ మాసంలో కొత్తగా పెళ్లయిన భార్య భర్తలను కూడా దూరంగా ఉంచుతారు. ఈ సాంప్రదాయం వెనుక గల కారణం ఏంటో తెలుసుకుందాం. వివాహాలను చాలావరకు అయితే మాఘ మాసంలో కానీ, వైశాఖమాసంలో కానీ జరిపిస్తారు.
వైశాఖమాసం అంటే ఎండాకాలం. మండే వేసవికి అనుకూలమైన మాసం. మండే వేసవికి కొత్తగా వచ్చిన పెళ్ళికూతురు అత్తారింట్లో అసౌకర్యంగా ఉంటుందట. అయితే పెళ్లికూతురుకు అసౌకర్య భావన కలగడంతో అత్త కోడల మధ్య సఖ్యత లేకుండా పోతుందట. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయట. అందువలన ఆషాడ మాసంలో కోడలని పుట్టింటికి పంపిస్తారని పెద్దవాళ్లు చెబుతుంటారు. అలాగే మరికొంతమంది దీనిని వేరే లాగా చెబుతుంటారు. అది ఏంటంటే ఆషాడ మాసం అంటే వర్షాకాలం. ఈ మాసం మొదలుకాగానే వర్షాలు మొదలవుతాయి. ఆషాడమాసం అనేది తొలకరి చినుకులతో పంటలు వేయడానికి అనుకూలంగా ఉండేది.
రైతులు కష్టపడితేనే దేశానికి తిండి దొరుకుతుంది. అయితే ఈ మాసంలో కొత్తగా పెళ్లయిన వరుడు భార్య మీద వ్యామోహంతో వ్యవసాయ పనులను దూరం పెడతాడు. అందువలన ఈ కారణం చేత కూడా భార్యని పుట్టింటికి పంపిస్తారట. అలాగే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తలు ఒకే దగ్గర ఉండకూడదు. ఎందుకంటే భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండడం వలన వారికి పుట్టబోయే బిడ్డకు మంచి గుణగణాలు రావు అని కొందరి నమ్మకం. అందుకే ఈ ఆషాడ మాసంలో భార్యను పుట్టింటికి పంపుతారు. ఆషాడ మాసంలో కోడలు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ మండే వేసవికాలంలో పుడతాడు. అలా పుట్టడం వలన భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉందనే కారణం చేత కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తలను ఒకే దగ్గర ఉంచరు.