Astro Tips : సూర్యోదయం తరువాత ఇలా చేస్తున్నారా …అయితే మీకు తప్పవు కష్టాలు !
Astro Tips : ప్రస్తుత కాలం లో మనం జీవించే విధానంలో ఎన్నో మార్పులు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. తినే ఆహార విధానంలో కూడా ఎన్నో మార్పులు , ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయినా కూడా అ ఖాతరు చేయరు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు అందరూ ఉండే విధానంలో మార్పులు. ప్రాచీన కాలంలో ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉండేది . అది తినే విషయం అయినా కావచ్చు పనుల విషయమైనా కావచ్చు. ఏదైనా గాని మంచి సమయంలో చేసే వాళ్ళు. ఇప్పుడు ఉన్న జీవితం ఉరుకుల పరుగుల జీవితం. టైం టూ టైం తినడం ఉండదు పనులు కూడా సమయం సందర్భం లేకుండా చేయడం. సూర్యోదయం తర్వాత ఏం చేయకూడదు ..
సూర్యోదయం కంటే ముందు మొదలుగా నిద్రలేవాలి సూర్యోదయం తర్వాత పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్న పిల్లల దాకా బాగా పొద్దుపోయే దాకా నిద్రలేస్తూనే ఉంటారు. అలా లేవడం వలన మన శరీరం బరువుగా ఉండటం బాగా బద్ధకస్తులుగా తయారవుతారు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సూర్యోదయం తర్వాత ఇంట్లో పూజ కూడా చేయకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి కి ఆగ్రహం వస్తుంది. అని అంటుంటారు. ఇంట్లో ఎన్నో అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయంట. అని చెబుతున్నారు. వాస్తునిపుణులు. ఇవన్నీ ఎలాంటి సమయంలో చేయాలి. తొమ్మిది సంవత్సరాల వయసు నుండి 50 సంవత్సరాల వయసు వారు సూర్యోదయం కాకముందే లేవాలి ఉదయం 5 గంటల లోపు లేవాలి చక్కగా లేచి వ్యాయామం,వాకింగ్ లాంటి చేసుకోవాలి.
సూర్యోదయం కంటే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ కూడా సూర్యోదయం కంటే ముందే చేయాలి .ఇలా చేయడం వలన ఆరోగ్య సమస్యలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. ప్రతి ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళు కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. అవన్నీ పాటించాలి. సూర్య అస్తమయం తర్వాత జుట్టు .దువ్వడం, తులసి మొక్కకు నీరు పోయడం, సాయంత్రం ఐదు గంటల తర్వాత నిద్రించడం, సాయంత్రం ఐదు గంటల నుండి 7 గంటల వరకు ఆహారం తీసుకోవడం, ఇంట్లో దీపాలు వెలిగించిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదని, ఇలాంటివన్నీ చేయకూడదని చెబుతుంటారు. పెద్దలు వాళ్లు చెప్పినవన్నీ పాటిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం.