Astrology Tips : మీరు ధనవంతులుగా మారాలనుకుంటున్నారా.? అయితే ఈ పక్షి ఈకలు మీ ఇంటిలో ఈ దిశలో ఉంచండి
Astrology Tips : ఈ సృష్టిలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. వాటిలో కొన్ని పక్షులను సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే కొన్ని పక్షులని దేవుడు రూపంలో ఆరాధిస్తూ ఉంటారు. అయితే పక్షులే కాకుండా వాటి ఈకలని కూడా అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఇందులో నెమలి ఈకలను బుక్స్ లలో పెట్టుకోవడం చాలామంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. దానిని పెట్టుకోవడం వల్ల చదువు బాగా వస్తుంది అని నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా పావురం ఈకలని కూడా ఇంట్లో ఉంచటం వలన ధనవంతులు అవుతారు అని జ్యోతి శాస్త్రం చెప్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. పావురాలు అప్పుడప్పుడు ఇంటి చుట్టూ ఆవరణలోకి వస్తూ ఉంటాయి. అలాంటి పావురాల ఈకలను ఇంట్లో ఉంచడం వలన ఇంట్లో కొన్ని గ్రహదోషాలు తొలగిపోవడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం ఇలాంటి సమస్యలు మెరుగుపడటం లాంటివి జరుగుతాయట అని జ్యోతిష్య శాస్త్రులు చెబుతున్నారు. అయితే ఈకలను ఎక్కడ ఉంచాలి? ఏ విధంగా నియమాలను పాటించాలి అనేది తెలుసుకుందాం.
ఈ పావురం మీ గృహానికి అదేవిధంగా మీ గృహ చుట్టుపక్కలకు రావడం, పోవడం జరుగుతుంటే మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చినట్లే అని అంటున్నారు. ఎందుకనగా ఈ పావురాన్ని దేవుని రూపంలో కొలుస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రాల విధానంగా చూసుకున్నట్లయితే పావురం అనేది గృహానికి రావడం వలన అన్ని శుభాలే కలుగుతాయి. అదేవిధంగా మీ ఇంట్లో గుడ్లు పెడితే మీరు పలు శుభవార్తలను వినబోతున్నారని సమాచారం. అదేవిధంగా జాబ్స్ కోసం ఎదురుచూసేవారికి ఈ పావురం ఈకకు గురువారం రోజున పసుపు రాసి పసుపు గుడ్డలో చుట్టి కొన్ని మూలల్లో ఉంచినట్లయితే శుభప్రదం అని చెప్పబడింది. ఈ విధంగా మీరు ఇంట్లో ఉంచుకున్నట్లయితే దీని ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు మీకు ఎదురవుతాయి అని అంటున్నారు.
అదేవిధంగా ఈ పావురం ఈకలతో ఎక్కువగా అప్పుల బాధ పడేవారు మంచి విముక్తి కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో పావురం ఈకలను ఇంటి కొన్ని మూలల్లో పెట్టండి. మీరు మీ రూమ్ లో దక్షిణ దిశలో ఒక ఈకను పెట్టండి. రెండోవ ఈకను కిచెన్ ఉత్తర దిశలో ఉంచండి. అలాగే మూడవ ఈకను బెడ్ రూమ్ లో తూర్పు దిశలో పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ పావురం ఈకలు ఇలాంటి సమస్యలు అన్ని తొలగిపోతాయి. అయితే ఈ పావురం ఈకలు తెలుపు, ఎరుపు వస్త్రంలో ఉంచి లక్ష్మీదేవిని ఆరాధించిన తర్వాత దానికి ఎర్రటి దారాన్ని కట్టి మీ అల్మారాలో పెట్టాలి. అయితే ఈకను ఉంచే ప్రదేశం మరెవరికి కనిపించకూడదు. అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.