Akshaya Tritiya 2022 : అక్షయ తృతీయ నాడు అస్సలే చేయకూడదని పనులేంటో తెలుసా?
Akshaya Tritiya 2022 : అక్షయ తృతీయ అంటేనే ఓ మంచి ముహూర్తంగా చూస్తుంటారు చాలా మంది ప్రజలు. అయితే జ్యోతిష్య శాస్త్ర నిపుణులతో పాటు ఈ పెద్దలు చెబుతుంటారు. హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ రోజున ఎక్కువాగ పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు, కొత్త వ్యాపారాలు, కొనుగోళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలన్నీ చేస్తుంటారు. అయితే వీటిలో కొనుగోళ్లకు అక్షయ తృతీయ మంచిదని చెబుతుంటారు. ముఖ్యంగా ఈరోజున బంగారం కొనుగోలు చేస్తే… ఎంతో మంచిదని చెబుతుంటారు. అక్షయ తృతీయ పండుగ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున వస్తుంది. హిందూ సంప్రదాయాల ప్రకారం అక్షయ తృతీయ… ఈ ఏడాది మే 3వ తేదీ మంగళ వారం రోజున వస్తుంది.
ఇలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీ దేవి విపరీతమైన కోపానికి గురవుతుందట. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.అక్షయ తృతీయ నాడు లక్ష్మీ దేవి సమేతంగా విష్ణుమూర్తిని పూజించాలి. ఈ పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. ఇలాంటి పరిస్థితిలో తులసి ఆకులను కోసే ముందు, పూజ తర్వాత తీసే ముందు శారీరక పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్నానం చేయకుండా తులసి ఆకులను తీయడం అస్సలే చేయొద్దు. అలాగే ఈరోజు వీలైనంత వెండి, బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి. ఇది వీలు కాకపోతే… కనీసం మెటల్ తో చేసిన చిన్న వస్తువులను అయినా ఇంచికి తీసుకురావచ్చు.
ఈరోజున లక్ష్మీదేవిని విష్ణువుతో కలిసి పూజించాలి. వేర్వేరుగా పూజిస్తే.. అశుభ ఫలితాలు కల్గుతాయి. అలాగే తులసి మొక్క, లక్ష్మీ దేవి ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వారి కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈరోజు వెల్లుల్లి, ఉల్లిపాయలను తినకూడదు. అలాగే పగటి పూట అస్సలే నిద్ర పోకూడదు. పేదవాడు మీ ఇంటికి వస్తే.. అతన్ని ఖాళీ చేతులతో వెల్లనివ్వవద్దు. వారికి ఆహారం ఇవ్వండి లేదా మరేదైనా దానం చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవితో పాటుశ్రీ మహా విష్ణువు, తులసీ మాత సంతోషిస్తారు. అక్షయ తృతీయ నాడు ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజ చేస్తే మాత్రమే వీరి కృపను మనం పొంద గల్గుతాం.