Ayyappa Swami : క‌న్నె స్వాములు అంటే అయ్య‌ప్ప స్వామి ఎందుకు ఇష్ట‌మో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ayyappa Swami : క‌న్నె స్వాములు అంటే అయ్య‌ప్ప స్వామి ఎందుకు ఇష్ట‌మో తెలుసా..?

Ayyappa Swami : అయితే ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప స్వామికి మంచి ఆదరణ ఉంది. ఇక ఈ ఆలయంలో ఉన్న స్వామిని అయ్యప్పగా కొలుస్తారు. అయ్యప్ప పేరు అయ్యా అంటే విష్ణువు మరియు అప్ప అంటే శివుడు అని అర్థం. విష్ణు అవతారం మోహిని మరియు శివుడు కలయిక వలన అయ్యప్ప జన్మించాడు కాబట్టి స్వామికి అయ్యప్ప అని పేరు వచ్చింది. ఇంకా ఈయనను హరిహరసుతుడు, మణికంఠ స్వామి అని కూడా పిలుస్తుంటారు. అయితే అయ్యప్ప స్వామి మాలదరణ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 December 2022,7:00 am

Ayyappa Swami : అయితే ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప స్వామికి మంచి ఆదరణ ఉంది. ఇక ఈ ఆలయంలో ఉన్న స్వామిని అయ్యప్పగా కొలుస్తారు. అయ్యప్ప పేరు అయ్యా అంటే విష్ణువు మరియు అప్ప అంటే శివుడు అని అర్థం. విష్ణు అవతారం మోహిని మరియు శివుడు కలయిక వలన అయ్యప్ప జన్మించాడు కాబట్టి స్వామికి అయ్యప్ప అని పేరు వచ్చింది. ఇంకా ఈయనను హరిహరసుతుడు, మణికంఠ స్వామి అని కూడా పిలుస్తుంటారు. అయితే అయ్యప్ప స్వామి మాలదరణ వేసుకున్న వారిలో కన్నేస్వాములను ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఎందుకంటే అయ్యప్ప స్వామికి కన్నే స్వాములు అంటే చాలా ఇష్టం. అయితే అయ్యప్పకు కన్నేస్వాములు అంటేనే ఎందుకంత ప్రీతి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొదటిసారిగా అయ్యప్ప మాలదరణ వేసుకున్న భక్తులను కన్నేస్వాములుగా పిలుస్తారు. అయితే అయ్యప్ప స్వామికి కన్నే స్వాములు అంటే ఇష్టం అనడానికి ఓ కథ ఉంది. ఇక పురాణాల్లోకెళ్తే దత్తాత్రేయుడి భార్య లీలావతి ఓ శాపంతో మహిషాసురుని సోదరి మహిషాసిగా జన్మించింది. అయితే ప్రజలను పట్టిపీడిస్తున్న మహిషాసురుని, లోకమాత సంహరించడంతో, తన అన్నను చంపినందుకుగాను దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని గోర తపస్సు చేసి శక్తులను పొంది మరలా ప్రజలను పిడించసాగింది. దీంతో దేవతల కోరిక మేరకు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు అయ్యప్పగా జన్మించి , మహిషిని సంహరిస్తాడు. దీంతో ఆమెకు శాప విమోచనం లభిస్తుంది. దీంతో ఆమె అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది. ఇక ఆమె కోరికను విన్న అయ్యప్పస్వామి తిరస్కరిస్తాడు.

Ayyappa Swami What is the Importance of Kanne Swamy

Ayyappa Swami What is the Importance of Kanne Swamy

అయినా సరే ఆమె పట్టు విడవకపోవడంతో , తన మాల వేసుకుని 41 రోజులు దీక్ష చేసిన కన్నె స్వామి తన దర్శనానికి రాన్నపుడు తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. ఇక వారి రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలను కుచ్చుతారు. అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో అప్పుడు పెల్లాడుతానని చెబుతాడు. అంతేకాకుండా శబరి కొండల్లో నీవు పురోత్తమ గా పూజలు అందుకుంటావని తెలిపారు. అయితే దీనికి గల అర్థం కన్నస్వామిల రాక ఎప్పటికీ ఆగదని. ఎందుకంటే అయ్యప్ప బ్రహ్మచారి అవతారం. దీనిలో భాగంగానే శబరిమలకు వచ్చిన కన్నె స్వాములు ఎరిమేలి నుంచి తీసుకువచ్చిన బాణాలను శరం గుత్తిలో గుచ్చుతారు. ఈ కారణం చేతనే ఎక్కడికి వెళ్లినా అయ్యప్ప భక్తులలో కన్నె స్వాములకు అంత ప్రాధాన్యత ఉంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది