Meena Rasi : శని వక్రగతి కారణంగా మీనరాశి వారికి అదృష్టాల పంట… కోటిశ్వరులు కావడం పక్క…!
ప్రధానాంశాలు:
Meena Rasi : శని వక్రగతి కారణంగా మీనరాశి వారికి అదృష్టాల పంట... కోటిశ్వరులు కావడం పక్క...!
Meena Rasi : వక్రీకరించిన శని ప్రభావం మీన రాశి వారి పైన ఏ విధంగా ఉంటుంది. శని సెప్టెంబర్ వరకు వక్రిగతి చెందుతుంది. ఈ సమయంలో మీన రాశి వారికి ఎలా ఉంటుంది లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయి…? అదేవిధంగా వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ? అలాగే మీన రాశి వారు శని వక్రీకరణ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన రాశికి అధిపతి గురు గ్రహం అలాగే మీన రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అందున శని వక్రగతి చెందుతుంది. శని కారకాలు చూస్తే శని వాయు కారకుడు ,ఆయువు కారకుడు ,కర్మ కారకుడు. శని దశలో నడుస్తున్నప్పుడు చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఈ సమయంలో వారు ఏ పని చేసినా అది ముందుకు సాగదు. అలాగే వీరు ఎంత కష్టించి పనిచేసిన ప్రతిఫలం అయితే రాదు. అలాగే అనారోగ్య సమస్యలు మనశ్శాంతి లేకపోవడం వైవాహిక సమస్యలు సంతాన సమస్యలు ఇలా అనేక దశలు ఉంటాయి.
అందువలన చాలామంది భయపడుతుంటారు. నిజానికి క్రమశిక్షణకు కారకుడు శని గ్రహమే. అలాగే మీన రాశి వారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. గతంలో ఇన్సూరెన్స్ కు సంబంధించినది ఉంటే అవి ఇప్పుడు జరుగుతాయి. రెండవ స్థానంలో శని వక్రీకరణ దశ ఉంది. ఏదైనా నష్టాలు , వైవాహిక జీవిత సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తారు. విదేశీ యానం బహుదూర ప్రాంతంలో ప్రయాణం ఉన్నవారికి సమస్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి మీన రాశి వారికి కర్మ అయితే తొలగిపోతుంది. అన్నిటి కంటే ముందు జీవన విధానం మార్పు చెందుతుంది. ఉదాహరణకు రేపు చేసుకునే పనులు ఈరోజు రాత్రి రాసుకొని ఏం చేయాలి అనే ప్రణాళిక వేసుకుని ఉన్నట్లయితే గనక దానికి తగ్గట్టు విజయాలు కూడా ఉంటాయి. మరి ఈ సమయంలో మీన రాశి వారు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Meena Rasi పరిహారాలు
ఈ సమయంలో మీన రాశి వారు రుద్రాక్ష మాలని ధరించాలి. దీనివల్ల ధనం ఐశ్వర్యం ,పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. లేదంటే 14 ముఖాలు కలిగి ఉన్న రుద్రాక్షలను ధరించాలి. దీనివల్ల మనశాంతి ఉంటుంది. ప్రతి శనివారం శనికి కైలాభిషేకం శివారాధన శనివారం నియమాలు పాటించాలి. తద్వారా మీ జీవితంలో అనుకున్నవన్నీ నెరవేరుతాయి.