ఫిబ్రవరి 23 భీష్మ ఏకాదశి ప్రత్యేకం : విష్ణుసహస్రనామాలు ఉద్భవించిన ఈ రోజున ఇలా చేస్తే ఇక అంతే !
Bhishma Ekadasi : విష్ణుసహస్రనామాలు.. తెలియని భక్తులు ఉండరు. దాదాపు అందరూ రోజు వింటూ ఉండే నామాలు. పవిత్రమైన ఈ నామాలను చాలా విశేషంగా భక్తులు పారాయణం చేస్తుంటారు. ఈ పవిత్రమైన నామాలను సేకరించి ఒక్కచోట పద్ధతి ప్రకారం చెప్పిన వారు భీష్మపితామహుడు. ఆయన అందించిన ఈనామాలను వ్యాసుడు మహాభారతంలో మనకు అందించాడు. ఈ నామాలు ఉద్భవించిన రోజే మాఘశుద్ధ ఏకాదశి. ఈరోజునే భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.. ఆజన్మ బ్రహ్మచారిగా విశేషమైన, విశిష్టమైన లక్షణాలతో నాటి, నేటి తరానికి ఒక ప్రతీకగా నిలచిన మహాధీశాలి, ప్రజ్ఞావంతుడు, అష్టవసువుల్లో ఒకరు అయిన భీష్ముడు. ఆయన మహాభారతానికి పునాదిగా కూడా చెప్పుకోవచ్చు. ఆయన పేరుమీద ఏర్పడిన భీష్మ ఏకాదశి. ఆ విశేషాలు తెలుసుకుందాం… మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాం. ఈ ఏకాదశికి విశేష ప్రాధాన్యం రావడానికి ప్రధాన కారణం
ఈ రోజునే విష్ణు సహస్ర నామం ఉద్భవించింది. విచిత్ర మైన ఘట్టం. ఒళ్ళంతా బాణాలు దిగి అంప శయ్య మీద ఉన్న అతి పుణ్యాత్ముడు అయిన భీష్మ పితామహుడు. యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడి సూచన మేరకు పాండవులు అందరూ అపంశయ్య మీద ఉన్న భీష్మడు దగ్గరకు వస్తారు. ఆ సమయంలో ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా విష్ణు సహస్రనామాలను భీష్ముడు చెప్పాడు. భీష్ముడు ఇచ్చా మరణ వరం కలవాడు. అంటే అనుకున్నపుడే మరణించ గలడు. ఉత్తరాయణ పుణ్య కాలం కోసం ఎదురు చూస్తూ 50 రోజులు వంటిలో దిగిన బాణాలతో అంప శయ్య మీద వేచి వున్నాడు.

Bhishma Ekadasi Visistatha Dharma Sandehalu Special
చివరికి మాఘశుద్ధ ఏకాదశి నాడు పవిత్ర మైన విష్ణు సహస్ర నామములను ఉపదేశించాడు ధర్మరాజుకు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు చిరు నవ్వు తో విని ఆమోదించాడు. ఇట్టి మహత్తర ఘట్టం ఎక్కడా లేదు. భగవంతుని దివ్య నామములను స్వయానా భగవంతుడే విని దీవించిన అపూర్వ ఘట్టం. కిమేకం దైవతం లోకే? కిం వాప్యేకం పారాయణం? స్తువంత కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం? కో ధర్మ సర్వ ధర్మానాం భవత పరమో మతః. కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్.?
ఫిబ్రవరి 23 భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటి
అర్థం: లోకంలో ఎవరు దైవము? ఎవరిని పూజించి, స్తుతించి అర్చించాలి. దేనివల్ల మానవులకు శుభం కలుగుతుంది. అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమేది. దేనిని జపించుట వలన మనిషి సంసార బంధముల నుండి విముక్తి పొందుతాడు? అని. అడుగగా దానికి భీష్మ పితామహుడు , జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అని చెబుతూ, ‘‘ అనాది నిధనం విష్ణుం సర్వ లోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఖాతిగో భవేత్.
ఆది అంతము లేని, సర్వ వ్యాపి అయిన, దేవ దేవుడైన , భగవంతుడైన విష్ణు స్తుతి వల్ల సర్వ దుఃఖములు తోలగుతవి- అని ఇంకా చెబుతూ ఎషమే సర్వ ధర్మానాం ధర్మోధిక తమో మతః- ఇదియే అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమని నా మాట అంటాడు. ముఖ్యం గా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది.