Sankranti : సంక్రాంతి పండగ రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారు ? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sankranti : సంక్రాంతి పండగ రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారు ?

Sankranti : సంక్రాంతి అంటే మొదట గుర్తుకు వచ్చేది బోగి. అందులోనూ మరీ గుర్తుకు వచ్చేది బోగి మంటలు. అసలు బోగి నాడు మంటలు ఎందుకు వేస్తారు. దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి పరిశీలిద్దాం.. భోగి అంటే రకరకాలు అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బోగి అంటే ‘తొలినాడు’ అనే అర్ధం ఉంది. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని నమ్మకంతో వీటిని వేస్తారు. మరో అర్థం […]

 Authored By keshava | The Telugu News | Updated on :14 January 2022,8:00 am

Sankranti : సంక్రాంతి అంటే మొదట గుర్తుకు వచ్చేది బోగి. అందులోనూ మరీ గుర్తుకు వచ్చేది బోగి మంటలు. అసలు బోగి నాడు మంటలు ఎందుకు వేస్తారు. దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి పరిశీలిద్దాం.. భోగి అంటే రకరకాలు అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బోగి అంటే ‘తొలినాడు’ అనే అర్ధం ఉంది. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని నమ్మకంతో వీటిని వేస్తారు. మరో అర్థం ప్రకారం ‘భగ’ అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని చెబుతారు. ‘భగ’ అంటే ‘మంటలు’ లేదా ‘వేడి’ని పుట్టించడం అని అర్ధం.అదేవిధంగా భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు పోస్తూ చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినిగా భావిస్తారు. రేగిపళ్ళను సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. భోగిపళ్ళలో చేమంతి బంతి పూరేకలు అక్షింతలు చిల్లర నాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు. ‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది.

భోగం అంటే సుఖం పూర్వం ఈరోజున శ్రీ రంగనథ స్వామిలో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగిపండగ ఆచరణలోకి వచ్చిందని మరో పురాణ గాధ కూడా ఉంది.హిమమంత రుతువు మధ్య భాగంలో సంక్రాంతి వస్తుంది. అంటే బాగా చలికాలం. కాబట్టి వెచ్చదనం కోసం మంటలు వేస్తారు. అయితే వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ఈమంటలు వేస్తారు. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో పూర్వకాలంలో వాడేవారు. మన దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. చెడుచేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల మొద్దులు, కట్టెలు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని జోడిస్తారు.

Bhogi festival special in Sankranthi

Bhogi festival special in Sankranthi

Sankranti : పూర్వ పద్ధతి వెనుక సైన్స్..

ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి ఔషధమయై ఉంటుంది. అంటే చాలా శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. దీనితో భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ నేడు విపరీత పోకడలతో ప్లాస్టిక్, ఇంట్లో పనికిరాని చెక్కలు, ప్లైవుడ్ వంటివి వేస్తున్నారు. దీని వల్ల శరీరానికి వేడి వస్తుంది కానీ మంచి జరుగదు. కాబట్టి పూర్వీకులు ఆచరించిన శాస్త్రీయ పద్ధతిని ఆచరిస్తే మంచిది. అంతేకాదు బోగి మంటలను తెల్లవారు ఝామున వేస్తారు. మనలోని బద్దకాన్ని తొలిగించుకుని ప్రాతఃకాలం లేవడం అలవాటు చేసుకోవడంతోపాటు ఆరోగ్య కరంగా ఉండటం, సంఘంలో అందరినీ కలుపుకోని పోవడం వంటి మంచి పనులు ఈ పండుగ ద్వారా బోగి మంటల ద్వారా మనం నేర్చుకోవాలి.

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది