Brahma Kamalam : హిమాలయాలలో కనిపించే ఈ దివ్యపుష్పం… వికసించే సమయంలో చూస్తే ఇదే జరుగుతుందట…?
Brahma Kamalam : ఈ పుష్పం చాలా అరుదుగా ఉంటాయి. ఇది హిమాలయాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్,హేమకుండ్, తుంగనాథ్ వద్ద మాత్రమే ఈ పుష్పం కనిపిస్తుంది. ఈ పుష్పాన్ని బ్రహ్మ కమలం అని కూడా పిలుస్తారు. ఇది స్వచ్ఛతకు ప్రత్యేకత కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చాలామంది తమ ఇళ్లల్లో కూడా ఈ మొక్కను పెంచుకుంటున్నారు. దాని అందం మంగళకరమైన స్వభావంగా నిజంగా చూడదగినదిగా అరుదైన దృశ్యం.

Brahma Kamalam : హిమాలయాలలో కనిపించే ఈ దివ్యపుష్పం… వికసించే సమయంలో చూస్తే ఇదే జరుగుతుందట…?
బ్రహ్మ కమలం, ఇది ఒక ఖగోళ పుష్పంగా పిలుస్తారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పుష్పిస్తుంది. అది కూడా ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. ఈ అనంత విశ్వానికి సృష్టికర్తగా పరిగణించే బ్రహ్మ దైవిక జననానికి సాక్షిగా బ్రహ్మ కమలాన్ని పిలుస్తారు. ఈ అరుదైన బ్రహ్మ కమలం సంవత్సరంలో ఒక్క రాత్రి మాత్రమే వికసిస్తుందట.అది ఉదయానికి వాడిపోతుంది. ఈ పుష్పం అనేక ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ పుష్పం చూసేందుకు ఎంతో అందంగా, పౌర్ణమి చంద్రునిలా కనిపించే బ్రహ్మ కమలం. వికసించె సమయంలో చూస్తుంటే తెలియని ఆధ్యాత్మికతను కలిగిస్తుంది. స్వచ్ఛతకు ప్రతీకగా కనిపిస్తుంది. ఈ పుష్పం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్,తుంగనాథ,వద్ద మాత్రమే ఈ బ్రహ్మ కమలాలు వికసిస్తాయి, కనిపిస్తాయి. కానీ ఇప్పుడు చాలామంది తమ ఇళ్లల్లోనూ పెరట్లోనూ కుం డీలలోనూ పెంచుకుంటున్నారు. ఈ బ్రహ్మ కమలం దాని అందం మంగళకరమైన స్వభావం ఇంకా చూడదగిన అరుదైన దృశ్యం అని చెప్పవచ్చు. హిమాలయాలలో బ్రహ్మ కమలం వికసించడానికి ఒక వేడుక జరుపుకుంటారు. కానీ, సంఘాలకు చెందిన స్థానికులు. బ్రహ్మ కమలం వికసించే సమయంలో వారు నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విశ్వాసము ఏమిటంటే బ్రహ్మ కమలం వికసించినప్పుడు ఎవరైతే తమ మనసులోని కోరికలను ఆ పుష్పానికి చెప్పుకుంటారో వారి కోరికలు నెరవేరుతాయి. అని కూడా నమ్ముతారు.