Dhantrayodashi : ధన త్రయోదశి రోజు ఈ మొక్కలు కొంటే లక్ష్మీదేవి కటాక్షం లభించినట్లే… కోటీశ్వరులవుతారు…!
dhantrayodashi : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధన త్రయోదశి పండుగను అశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో జరుపుకుంటారు. అయితే ఈ రోజున ధన్వంతరి మరియు కుబేరుడిని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తారు. అలాగే ఈ రోజున కొత్త వస్తువులను కొనుగోలు చేయడం వలన పుణ్యఫలం లభిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన మొక్కలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఇంట్లో సంపద పెరుగుతుంది. మరి ధన త్రయోదశి రోజున ఏ ఏ మొక్కలను ఇంటికి తీసుకురావాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
హిందూమతంలో సకల దేవుళ్లకు ఏదో ఒక మొక్క అంటే ఇష్టం ఉంటుంది. కాబట్టి ధన త్రయోదశి రోజున మొక్కలను ఇంట్లో నాటడం వలన దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే లక్ష్మీదేవి కుబేరుడి అనుగ్రహం కోసం తన త్రయోదశి రోజున ఈ మొక్కలను నాటడం మంచిది.
dhantrayodashi కుబేరుడికి ఇష్టమైన మొక్క
సంపదల దేవత అయిన కుబేరుడుకి క్రాసుల మొక్క అంటే ఇష్టం. కాబట్టి ధన త్రయోదశి రోజున మొక్కను ఇంట్లో నాటడం వలన డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంట్లో పేదరికం తొలగిపోతుంది. అలాగే అప్పుల నుంచి విముక్తి పొందుతారు. అదేవిధంగా ధన త్రయోదశి రోజున క్రాసుల మొక్కను ఇంట్లో నాటడం వలన అనేక రోగాలు పోయి ఆరోగ్యం మెరుగు పడుతుంది. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న లేదా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే వారు ఈ మొక్కను ఇంట్లో నాటడం వలన సమస్యలన్నీ దూరమవుతాయి.
లక్ష్మీ కమలం : వాస్తు శాస్త్రంలో లక్ష్మి కమలానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. లక్ష్మీదేవికి కమలం అంటే ఎంతో ఇష్టం. కాబట్టి ధన త్రయోదశి రోజు లక్ష్మీ కమలాన్ని ఇంట్లో నాటడం మంచిది. అయితే దీనిని ఇంటి ద్వారం దగ్గర ఉంచండి. ఈ మొక్క ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుందని నమ్ముతారు.
మందార మొక్క : ధన త్రయోదశి రోజున ఇంట్లో మందార మొక్కను నాటడం చాలా శ్రేయస్కరం. మందారం మొక్క అంటే కుబేరుడికి ఎంతో ప్రీతికరమైనది. అదేవిధంగా లక్ష్మీదేవి పూజలో ఎర్రమందారం సమర్పించడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
తులసి మొక్క : హిందూమతంలో తులసి మొక్కను దేవతగా భావించి పూజిస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ధన త్రయోదశి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం ద్వారా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
తెల్ల అపరాజిత : ధన త్రయోదశి రోజున తెల్లటి అపరాజిత మొక్కను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నాటడం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది. అలాగే లక్ష్మీదేవి ఇంటికి చేరుతుందని నమ్ముతారు. అదేవిధంగా ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.