Dhantrayodashi : ధన త్రయోదశి రోజు ఈ వస్తువులను అస్సలు కొనకండి .. లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dhantrayodashi : ధన త్రయోదశి రోజు ఈ వస్తువులను అస్సలు కొనకండి .. లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది..

Dhantrayodashi : మన హిందూ మతంలో దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుతారు. దీనిని ఐదు రోజుల పండుగగా పిలుస్తారు. ధన త్రయోదశి రోజున మొదలై ఐదవ రోజైన కార్తీక శుద్ధ విదియన ముగుస్తుంది. దీపావళి రోజున పచ్చిశనగపప్పును లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ఈ పప్పును రావి చెట్టుకు సమర్పిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. దీపావళికి ముందు ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. నవంబర్ 10న ధన త్రయోదశి వచ్చింది. ఈ రోజున ధన్వంతరి […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Dhantrayodashi : ధన త్రయోదశి రోజు ఈ వస్తువులను అస్సలు కొనకండి ..

  •  లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది..

Dhantrayodashi : మన హిందూ మతంలో దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుతారు. దీనిని ఐదు రోజుల పండుగగా పిలుస్తారు. ధన త్రయోదశి రోజున మొదలై ఐదవ రోజైన కార్తీక శుద్ధ విదియన ముగుస్తుంది. దీపావళి రోజున పచ్చిశనగపప్పును లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ఈ పప్పును రావి చెట్టుకు సమర్పిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. దీపావళికి ముందు ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. నవంబర్ 10న ధన త్రయోదశి వచ్చింది. ఈ రోజున ధన్వంతరి స్వామి, లక్ష్మీదేవి, కుబేరులను పూజిస్తారు. అయితే ఈ రోజున వస్తువులను కొనుగోలు చేయడం చాలా మంచిదిగా పరిగణిస్తారు.

ఆరోజు ఏ వస్తువులు కొన్న 13 రెట్లు అవుతుందని భావిస్తారు. అందుకే దీనిని ధన త్రయోదశి అంటారు. ఈ రోజు నా పాత్రలు, బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. అయితే దీపావళి రోజున కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదు. విరిగిన ఐరన్ మరియు రాగి పాత్రలు ఇంట్లో అస్సలు ఉంచకూడదు. విరిగిన వస్తువులు ప్రతికూలతను చూపిస్తాయి. కాబట్టి వెంటనే వీటిని బయట అమ్మేయాలి. లేదంటే పడేయాలి. అలాగే ఆగిపోయిన గడియారం కూడా ఇంట్లో ఉండటం మంచిది కాదు. ఆగిపోయిన గడియారం దురదృష్టానికి చిహ్నం. ప్రతి ఒక్కరూ మంచి సమయాన్ని గడపాలని కోరుకుంటారు. కాబట్టి ఆగిపోయిన గడియారం ఇంట్లో ప్రతికూలతను చూపిస్తుంది.

చిరిగిపోయిన బూట్లు, దుస్తులు ఇంట్లో ఉంచకూడదు. ఇది ప్రతికూలతను చూపిస్తాయి. కాబట్టి వీటిని వెంటనే తీసేయాలి. దీపావళి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద బూట్లు, చెప్పులు పెట్టకూడదు. విరిగిన దేవుడి విగ్రహాలు అస్సలు ఉంచకూడదు. ధన త్రయోదశి రోజున కొన్న వస్తువు రెట్టింపు అవుతుంది. కాబట్టి బంగారం, వెండి, నగలు, పాత్రలు కొనుగోలు చేయడం చాలా శుభప్రదం. ఒకవేళ వీటిని కొన లేకపోతే ఇత్తడి పాత్రలనైనా కొనుగోలు చేయాలి. అలాగే వెండి, నాణెం కూడా కొనటం చాలా మంచిది. గణేశుడు ఉన్న వెండి, నాణెలను కొనుగోలు చేస్తే శుభం జరుగుతుంది. వీటిని పూజించిన తర్వాత బీరువాలో పెట్టాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది