Budha AdithyaYogam : బుధ, సూర్యులు కలసి వస్తున్నారు… ఈ రాశులకి మంచి రోజులు రాబోతున్నాయి… బుధాదిత్య రాజయోగం…?
ప్రధానాంశాలు:
Budha AdithyaYogam : బుధు,సూర్యులు కలసి వస్తున్నారు...ఈ రాశులకి మంచి రోజులు రాబోతున్నాయి...బుధాదిత్య రాజయోగం...?
Budha AdithyaYogam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, జాతకాలను అంచనా వేసి చెప్పగలరు. అయితే, నేటి నుంచి కొన్ని రాశుల వారికి, బుధుడు, సూర్యుడు ఈ రెండు గ్రహాలు కలిసి వస్తుండడంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. అయితే జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక జనవరి 24వ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశించాడు.
Budha AdithyaYogam బుధాదిత్య రాజయోగం
అప్పటికే మకర రాశిలో ఉన్న సూర్యునితో బుధుడు సంయోగం చెంది నేటి నుండి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ఫిబ్రవరి 11వ తేదీ వరకు మకర రాశిలోనే కొనసాగుతుంది. అయితే కొన్ని రాశులకు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ రాజులు ఏమిటో తెలుసుకుందాం….
ధనస్సు రాశి :
మకర రాశి లోని ఉగాదిత్య రాజయోగం కారణంగా నేటి నుంచి ఫిబ్రవరి 11 వరకు ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారు ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా వచ్చే సమయం. పనిలో విజయాలు వీరివే. తిగతంగా జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. వర్తకవ్యాపారాలకు మంచి సమయం.
మకర రాశి :
అయితే నేటి నుంచి మకర రాశిలో బుధాదిత్య రాజయోగం కారణంగా మకర రాశి వారికి అన్ని శుభాలే. రాశి వారికి ఆర్థికంగా పురోగతి లబ్ధి పొందుతారు. అలాగే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు.
తులారాశి :
ఉదాదిత్య రాజయోగం వలన తులా రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. తులా రాశి వారికి ఏ నూతన వ్యాపారాలకు పెట్టిన పెట్టుబడులకు ఆదాయాలు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం అందుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇదే మంచి అనుకూల సమయం.
కుంభరాశి :
బుధాదిత్య రాజయోగం కారణంగా కుంభ రాశి వారికి ప్రీత రాజయోగం కలగబోతుంది. ఆర్థిక విషయాలలోనూ, వృత్తి వ్యాపారాలలోనూ కుంభ రాశి జాతకులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉదాదిత్య రాజయోగం కుంభ రాశి జాతకులకు మంచి అవకాశాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరికి కొన్ని కొత్త ఆలోచనలు రానున్నాయి. అయితే వీరికి అన్ని విధాలుగా కూడా మంచే జరుగుతుంది.