Chanakya Niti : వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే పెళ్లికి ముందేఈ మూడు విషయాలు తెలుసుకోండి… ఆచార్య చాణిక్యుడు…!
Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన గొప్ప ఆర్థిక వేత , దౌత్యవేత , గొప్ప వ్యూహకర్త ..మనిషి యొక్క జీవితాన్ని తనదైన కోణంలో సహజంగా ఆవిష్కరించిన మహానుభావుడు. అందుకే ఎవరైనా సరే జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాణక్యుని నీతి వాక్యాలు తెలుసుకోవడం చాలా మంచిదని ఎన్నో సందర్భాలలో పెద్దలు చెబుతుంటే విన్నాం. ఆయన నీతి కథలు చదవడం వలన జీవితాన్ని సుఖసంతోషాలతో గడపవచ్చని చాణక్యుడి యొక్క […]
ప్రధానాంశాలు:
Chanakya Niti : వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే పెళ్లికి ముందేఈ మూడు విషయాలు తెలుసుకోండి... ఆచార్య చాణిక్యుడు...!
Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన గొప్ప ఆర్థిక వేత , దౌత్యవేత , గొప్ప వ్యూహకర్త ..మనిషి యొక్క జీవితాన్ని తనదైన కోణంలో సహజంగా ఆవిష్కరించిన మహానుభావుడు. అందుకే ఎవరైనా సరే జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాణక్యుని నీతి వాక్యాలు తెలుసుకోవడం చాలా మంచిదని ఎన్నో సందర్భాలలో పెద్దలు చెబుతుంటే విన్నాం. ఆయన నీతి కథలు చదవడం వలన జీవితాన్ని సుఖసంతోషాలతో గడపవచ్చని చాణక్యుడి యొక్క మాటలు జీవితాన్ని సంతోషంగా మార్చడమే కాకుండా వైవాహిక జీవితాన్ని కూడా ఎంతో ఆనందంగా తీర్చిదిద్దుతుందని చెబుతుంటారు. ఇక ఈ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండేందుకు చాణక్యుడు తన నీతి వాక్యాల ద్వారా అనేక విషయాలను తెలియజేయడం జరిగింది.
వీటిని పాటించడం వలన మనిషి యొక్క వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. అలాగే దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోవడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. మరి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండేందుకు చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైవాహిక జీవితంలో దంపతులు సంతోషంగా ఉండాలంటే పెళ్లికి ముందే కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని చాణిక్యుడు సూచించడం జరిగింది..పెళ్లికి ముందే ఈ మూడు విషయాల గురించి తెలుసుకోవడం వలన వారి యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని తెలిపారు. మరి అవేంటంటే…
Chanakya Niti వివాహానికి సరైన వయస్సు…
ఆచార్య చాణక్యుడి నీతి వాక్యాల ప్రకారం వివాహానికి ముందే కాబోయే భాగస్వామి యొక్క వయసును తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలట. ఎందుకంటే భార్య భర్తల మధ్య విభేదాలు రావడానికి గల ముఖ్య కారణం వారి మధ్య ఉన్న వయోభేదమేనని చాణిక్యుడు తెలియజేస్తున్నాడు. అలాగే దంపతుల మధ్య అవగాహన లేకపోతే వారి యొక్క వైవాహిక జీవితం విచ్ఛిన్నం అవుతుంది. ఇక భార్య భర్తల యొక్క వయోభేదం ఎక్కువగా ఉన్నట్లయితే వారి యొక్క ఆలోచన విధానాలు కూడా చాలా వేరువేరుగా ఉంటాయి. తద్వారా వారి మధ్య ఎక్కువగా గొడవలు వచ్చే అవకాశం ఉందని చాణక్యుడు తెలిపారు. అందుకే భార్యాభర్తల మధ్య వయసు అనేది ఎక్కువగా ఉండకూడదని , వయోభేదం ఎక్కువగా ఉండకపోవడమే మంచిదని ఆయన తెలియజేయడం జరిగింది.
ఆరోగ్య సమాచారం..
చాణక్యుడు బోధించిన నీతి ప్రకారం వివాహానికి ముందు భాగస్వామి యొక్క ఆరోగ్య సమాచారం కూడా కచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. భాగస్వామి యొక్క పరిస్థితి శారీరకంగా లేదా మానసికంగా ఏదైనా సమస్యలు ఉంటే స్పష్టంగా చెప్పాలి తెలుసుకోవాలి. ఇలా చేయడం వలన భవిష్యత్తులో ఇద్దరి మధ్య ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.
పాత సంబంధాలు…
ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం పెళ్లికి ముందే కాబోయే భాగస్వామి యొక్క గతం గురించి తెలుసుకోవాలని నమ్ముతారు. వారి యొక్క సంబంధాల గురించి పెళ్లికి ముందే చెప్పడం వలన భవిష్యత్తులో వారి యొక్క వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని తెలియజేయడం జరిగింది. దాపరికం లేని దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందనేది నమ్మకం.