Chanakya Niti : ఈ విషయాల్లో అసంతృప్తి కూడా మంచిదేనంట.. చాణక్య చెప్పిన నీతి..!
Chanakya Niti : మనిషి జీవితంలో రెండు కీలకంగా ఉంటాయి. అవే సంతృప్తి, అసంతృప్తి. ప్రతి పనిలో ప్రతి మనిషి సంతృప్తిని, అసంతృప్తిని వెతుక్కుంటాడు. అయితే ఎవరైనా సరే సంతృప్తిని కోరుకుంటారు తప్ప అసంతృప్తిని మాత్రం కోరుకోరు. అయితే మానవుల జీవితంలో ఎదురయ్యే సంతృప్తితో పాటు అసంతృప్తి కూడా మంచిదే అని ఆచార్య చాణక్యుడు వివరించాడంట. ఆయన రాసిన నీతి శాస్త్రంలో వీటి గురించి చాలా కూలంకుషంగా వివరించాడు. ఈ రెండింటి ప్రాముఖ్యతను చాలా అద్భుతంగా వివరించాడని చెబుతుంటారు.చాణక్య నీతి ప్రకారం.. జీవితంలో ఆయా సందర్భాలను బట్టి సంతృప్తి, అసంతృప్తి రెండూ కూడా మన జీవితాల్లో ఏదో ఒక రూపంలో ప్రయోజనాన్ని నింపుతాయంట.
అయితే అవి ఏ రూపంలో ఉంటాయనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. మనిషి జీవితంలో సంతృప్తితో పాటు అసంతృప్తి కూడా అవసరం అని వివరించారంట. అసంతృప్తి అనేది మనిషిని మరింత కష్టపడేలా చేస్తుందని, తద్వారా అతని జీవితం ఉన్నత శిఖరాలను అధిరోహించేలా అసంతృప్తి ఉపయోగపడుతుందంట. మగవారు తమ భార్యలు అందంగా లేకున్నా సంతోషించాలి.అసంతృప్తి పడకూడదు. ఇక తినే ఆహారంలో ఏం దక్కినా సరే దాన్ని సంతీప్తిగా తినాలంట. సంతృప్తి చెందక వదిలేస్తే మనకే నష్టం. అలాగే ఆదాయం విషయంలో సంతీప్తిగానే ఉండాలి.
Chanakya Niti:ఈ విషయాల్లో సంతృప్తిగా ఉండొద్దు..
కానీ విద్య, జ్ఞానం లాంటి విషయాల్లో మాత్రం అసంతృప్తిగానే ఉండాలంట. ఎందుకంటే చాలు అనిపిస్తే నేర్చుకునేందకు ఇష్టం చూపించం. అలాగే దానం చేయడంలో కూడా అసంతృప్తిగానే ఉండాలంట. ఎందుకంటే దానం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే దేవుడి మంత్రాన్ని జపించడంలో కూడా సంతీప్తి చెందకూడదు. భగవంతుడిని ఎంత ప్రార్థిస్తే అంత మేలు జరుగుతుందని చాణక్యుడు చెప్పుకొచ్చాడు. ఈ విషయాల్లో మాత్రం ఇలా అసంతృప్తి ఉంటేనే మరింత కష్టపడుతామని, కాబట్టి అది అంతిమంగా మన జీవితానికే మేలు చేస్తుందని చాణక్య వివరించాడంట.