Chanakya Niti : వీళ్ల‌తో అస్స‌లు విభేదించ‌కండి… వీరు దూర‌మైతే అన‌ర్థాలే అంటున్న చాణక్యుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakya Niti : వీళ్ల‌తో అస్స‌లు విభేదించ‌కండి… వీరు దూర‌మైతే అన‌ర్థాలే అంటున్న చాణక్యుడు

 Authored By mallesh | The Telugu News | Updated on :6 April 2022,8:20 am

Chanakya Niti : ఆచార్య చాణక్యుడు తన జీవితంలో ఎదురైన ఎన్నో అనుభవాలను పలు పుస్తకాలుగా రచించాడు. చాణుక్యుడు రచించిన నీతిశాస్త్రంలో మానవ జీవిన విధానం, రాజ్యపాలన, మంచి చెడులు ఇలా అనేక విషయాలను ప్రస్తావించాడు. ఈ నీతిశాస్త్రంలో మనిషి జీవిత విధానానికి బంధించిన అనేక విషయాలను చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం త‌న చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను గుర్తించే సామర్థ్యం లేని వ్యక్తిని ఎవరూ బాగుచేయలేరు. ముఖ్యంగా ఎవరితోనైనా కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండకపోతే జీవితంలో అనుకోని నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే కొంద‌రిని జీవితంలో వ‌దులుకోకూడ‌ద‌ని కూడా సుచించాడు. ఈయ‌న నీతిని ఇప్ప‌టికీ చాలా మంది అనుస‌రిస్తారు.

ఆచార్య చాణక్య ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో చాలా తప్పులు చేస్తాడు. తరువాత పశ్చాత్తాపపడతాడు. అటువంటి పరిస్థితిలో అందరితో మంచి సంబంధాలను కొనసాగించడం అవసరం. ఒక వ్యక్తితో ఈ నలుగురు వ్యక్తులు వాదించకూడదని చెబుతున్నారు. అవేంటో తెల‌సుకుందాం..ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒక మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకూడదు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. మూర్ఖుడు ఎవరి మాట వినడు. అతను తన మాట మాత్రమే మాట్లాడుతాడు. కనుక అలాంటి వ్యక్తి నుంచి దూరంగా ఉండాలి. స‌మ‌యాన్ని వృథా చేసుకోవ‌ద్ద‌ని సూచించాడు.గురువు ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తాడు. లక్ష్యాన్ని సాధించడానికి మోటివేట్ చేస్తాడు. గురువు లేకుండా.. మీరు జ్ఞానాన్ని కూడా పొందలేరు.

Chanakya Niti person should never dispute with these people

Chanakya Niti person should never dispute with these people

అటువంటి పరిస్థితిలో మీరు గురువుతో వాదించకుండా ఉండటం ముఖ్యం. ఇది మీ భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపే అవ‌కాశం ఉంటుంది. అలాగే జ్ఞానాన్ని కోల్పోయే ప్ర‌మాదం ఉంటుంది.ఇష్ట‌మైన‌వారు జీవితంలో ముందుకు సాగడానికి ఒక వ్యక్తికి ప్రేరణగా నిలుస్తారు. అందువల్ల, మీ ఇష్ట‌మైన వారితో ఎప్పుడూ వాదించకండి. ఇది మీకు హాని కలిగించే అవ‌కాశం ఉంది. అలాగే మన సంతోషాల‌ను భాద‌ల‌ను నిర్భయంగా చెప్పుకునే ఫ్రెండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కడైనా ఉంటాడు. మన రహస్యాలు ఆ స్నేహితుడికి తెలుసు. అందుకే అలాంటి మంచి స్నేహితుడితో ఎప్పుడూ వాదించకండి. ఎందుకంటే అతనికి మీ పై వ్యతిరేకత ఏర్పడితే మీ సీక్రెట్స్ ని ఇతరుల‌కు చెప్పే ప్రమాదం ఉంటుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది