Chanakya Niti : భార్యభర్తలు అస్సలుకే అలా చేయొద్దంటున్న చాణక్యుడు
Chanakya Niti : చాణక్యుడు చాలా నీతి సూత్రాలను చెప్పాడు. చాణక్యుడి నీతా సూత్రాలు చాలా విషయాల్లో ప్రూవ్ అయ్యాయి. చిన్న పిల్లల విషయంలో చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు వంద శాతం నిజం అవుతున్నాయి. అటువంటి చాణక్యుడు భార్యాభర్తల విషయంలో కూడా అనేక నీతి సూక్తలు బోధించాడు. భార్యాభర్తలు ఎలా మసులుకోవాలనే విషయం గురించి ఆయన చెప్పిన మాటలు విన్న వారు లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటారు. ఆయన సూత్రాలను పాటించని అనేక మంది గొడవలు పడుతూ జీవితాన్ని అయోమయ పరిస్థితిలోకి నెట్టేసుకుంటున్నారు.
అందుకోసమే చాలా మంది కపుల్స్ చాణక్యుడు చెప్పిన నీతి సూక్తులను పాటిస్తూ వస్తున్నారు. చాణక్యుడు నీతి శాస్త్రంలో భార్యాభర్తలు ఎలా మెదులుకోవాలో తెలియజేశాడు.ప్రపంచంలో ఉన్న ఎవరి కాపురంలోనైనా కలహాలు సహజం. అసలు కలహాలు లేని కాపురమే ఉండదని చాలా మంది చెబుతారు. ఎంత అన్యోన్యంగా ఉండే వారైనా సరే ఏదో ఒక విషయంలో కలహాలు పడుతూనే ఉంటారు. ఒక్కోసారి ఈ కలహాలు భారీ స్థాయిలో కూడా ఉంటాయి. కాబట్టి కలహాలకు ఎంత దూరంగా ఉంటే ఆ కపుల్స్ కాపురంలో ప్రేమ అంతలా చిగురిస్తుంటుంది.
Chanakya Niti : భార్య భర్తలు అస్సలుకే అలా చేయొద్దట
కాబట్టే కలహాలు పెట్టుకోకూడదని చాలా మంది పెద్దవారు చెబుతారు. ఆచార్య చాణక్యుడు కూడా ఇదే విషయాన్ని బోధించాడు. భార్యాభర్తల కాపురంలో నమ్మకం అనేది కీలకమని ఆచార్యుడు చెప్పాడు. నమ్మకం లేకపోతే వారి కాపురం సజావుగా సాగదని ఉద్ఘాటించాడు. నమ్మకం తప్పకుండా ఉండాలని తెలిపాడు. భాగస్వామిని అవమానించడం చాలా తప్పు అని చాణక్యుడు బోధించాడు. అవమానాల వలన అనేక కలహాలు జరుతాయని తెలిపాడు. కాబట్టే ఇతరులను అవమానించకుండా మసులుకోవాలని తెలియజేశాడు.