Chanakya Niti : ఇలాంటి స్త్రీలు మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోవద్దంటున్న చాణక్య
Chanakya Niti : చాణక్యుడు దౌత్య, ఆర్థికశాస్త్రం, రాజకీయ వ్యూహాలతో చంద్రగుప్తుడిని రాజును చేసిన గొప్ప మేధావి. చాణక్యను కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యాబుద్దులు నేర్చుకుని అపార జ్ఞానాన్ని సంపాదించాడు. చాణక్య రచించిన నీతిశాస్త్రంలో మనవ జీవన విధానాల్ని వివరించాడు. ఎవరితో స్నేహం చేయాలి. ఎవరికి దూరంగా ఉండాలి.. పిల్లలను ఎలా పెంచాలి. భార్యభర్తలు ఎలా ఉండాలి.. స్త్రీలను ఎలా గౌరవించాలని చక్కగా వివరించాడు.చాణక్య ప్రకారం.. అయితే చాలా మందికి సరైన జీవిత భాగస్వామి దొరికితే ఎంతో సంతోషంగా ఉంటారు.
అర్థం చేసుకునే భార్య దొరికితే ఆ ఇంట్లో ప్రశాంతత, సుఖసంతోషాలు ఉంటాయి. ప్రపంచంలో ఎవరికీ కీడు చేయని వారు ఎవరైనా ఉన్నారంటే అది తల్లి అని చెప్పవచ్చు. తల్లి ఎప్పుడూ చెడు చేయాలని చూడదు. స్త్రీలు నమ్మితే భాగస్వామి కోసం ఏదైనా చెస్తారు.స్త్రీలకు విద్యను నేర్పించినట్లైతే భావితరాలకు ఆమె ఆదర్శంగా ఉంటుందిని అందరినీ గౌరవిస్తుందని చెప్పాడు. ఆడవారు కుటుంబాన్ని గౌరవించడమే కాకుండా అందరితో ప్రేమగా మెదిలి అందరనీ బాగా చూసుకుంటుందని, విద్ నేర్పితే తర్వాతి తరాలకు కూడా అందిస్తుందిని చెప్పాడు.

Chanakya Niti If there are similar women in your life
కుటుంబ పరువు, ప్రతిష్టలు కాపాడుతూ ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకుని ధైర్యంగా నిలబడుతుందని చెప్పాడు.స్త్రీల అందం కంటే గుణం చూడాలని అప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ వెంటే ఉంటూ మీ ఎదుగుదలకు సహకరిస్తుంది. మంచి నడవడిక కలిగిన ఆడవారు కుటుంబ గౌరవాన్ని కాపాడి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాడు. అందుకే అటువంటి వాళ్లు మీ జీవితంలో ఉంటూ వదులుకోకూడదని చెప్పాడు. ఈ లక్షణాలు ఉన్నా స్త్రీలతో గొడవలు వచ్చినా తగ్గి మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించాడు. ఇలాంటి ఆడవారిని గౌరవిస్తే మీ గౌరవం పెరగడంతో పాటు ఆర్థికంగా మంచి జరుగుతుందని చెప్పాడు.