Chanakya Niti : చాణక్య నీతి ఈ సూత్రాలతో.. మీరు ఎంచుకున్న రంగంలో విజయం మీ సొంతం.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chanakya Niti : చాణక్య నీతి ఈ సూత్రాలతో.. మీరు ఎంచుకున్న రంగంలో విజయం మీ సొంతం..

Chanakya Niti : చాణక్యుడు.. తక్షశిల విశ్వ విద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేశాడు. భారత గొప్ప రాజనీతి, తత్వశాస్త్రవేత్తగా ఈయనకు మంచి పేరుంది. చాలా సార్లు ఈయన పేరు గురించి అందరూ చెప్తుంటారు. ఏదేని పనిలో విజయం సాధించాలంటే చాణక్యుడి రచనలు చదవాలని అంటుంటారు. అలా మానవాళికి ఉపయోగపడే అనేక రచనలను చాణక్యుడు చేశాడు. అందులో ఒకటి ‘చాణక్య నీతి’. ఇందులో మానవ జీవితానికి సంబంధించిన పలు విషయాలను, అనుభవాల సారాలను ప్రస్తావించాడు.చాణక్యుడి రచనలు అందరికీ అర్థమయ్యే […]

 Authored By mallesh | The Telugu News | Updated on :17 December 2021,9:40 pm

Chanakya Niti : చాణక్యుడు.. తక్షశిల విశ్వ విద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేశాడు. భారత గొప్ప రాజనీతి, తత్వశాస్త్రవేత్తగా ఈయనకు మంచి పేరుంది. చాలా సార్లు ఈయన పేరు గురించి అందరూ చెప్తుంటారు. ఏదేని పనిలో విజయం సాధించాలంటే చాణక్యుడి రచనలు చదవాలని అంటుంటారు. అలా మానవాళికి ఉపయోగపడే అనేక రచనలను చాణక్యుడు చేశాడు. అందులో ఒకటి ‘చాణక్య నీతి’. ఇందులో మానవ జీవితానికి సంబంధించిన పలు విషయాలను, అనుభవాల సారాలను ప్రస్తావించాడు.చాణక్యుడి రచనలు అందరికీ అర్థమయ్యే విధంగా ఉండటం విశేషం.ప్రతీ ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాణక్యుడు సరళమైన రచనలు చేశాడు.

Chanakya Niti : ప్రతీ ఒక్కరికి అర్థమయ్యే విధంగా సూచనలు..

chanakya Niti if you follow these rules you will succeed in your organisation

chanakya Niti if you follow these rules you will succeed in your organisation

అపర చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే కనుక ఎంచుకున్న రంగంలో విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. ఆ విషయాలను ఇక్కడ చర్చిద్దాం. ఈ విషయాలను పాటిస్తే కనుక మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతారు. ఇక మీరు పని చేసే చోట ఎదుటివారిని గౌరవించాలి. వారిని చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ అసూయ పడకూడదు. భగవంతుని సర్మించుకుంటుండాలి. భగవంతుని నామ స్మరణ చేత విజయం వరిస్తుంది.ఇకపోతే ఎవరైనా సరే తమకున్న కష్టాలు, ఇబ్బందులను ఇతరులకు ఎట్టి పరిస్థితులలో చెప్పకపోవడమే మంచిదని చాణక్యుడు చెప్తున్నాడు. ఇతరులకు ఈ విషయాలు చెప్పడం వలన ఇంకా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే మనకున్న లోపాలను అస్సలు బయటపడొద్దని చాణక్య నీతి గ్రంథంలో పేర్కొన్నారు. ఇక ఏదేని పనిని స్టార్ట్ చేసే ముందర ఫెయిల్యూర్ గురించి అస్సలు భయపడొద్దు. ఇకపోతే ఏదేని తప్పు జరిగితే తమను తాము కూడా నిందించుకోకూడదు. అలా చేయడం వలన నిరాశ, నిస్పృహలు అలుముకుని మీకే ఇబ్బందులు వస్తాయి. తద్వారా లక్ష్యం నుంచి దూరమయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చేసే పని గురించి వర్రీ కావొద్దు. హ్యాపీగా పనిలో ముందుకు సాగాలి. అలా అయితేనే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశాలుంటాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది