Chanakya Niti : సమాజంలో గౌరవ, మర్యాదలు పొందాలంటే.. ఇలాగే నడుచుకోవాలంటున్న చాణక్య..!
Chanakya Niti : మనం సమాజంలో గౌరవంగా, హాయిగా బతకాలంటే కచ్చితంగా ఆచార్య చాణక్యుడు సూచించిన నియమ మిబంధనలను పాటించాలి. అయితే ఆచార్య చాణక్యుడు మంచి సామాజిక శాస్త్రవేత్త. ఇతను రచించిన నీతి శాస్త్రం చాణక్య నీతిగా పేరు పొందింది. అయితే ఇందులో చాణక్యుడు పేర్కొన్న విధానాలను అవలంభించే వ్యక్తికి సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయని, గొప్ప వ్యక్తిగా కీర్తింపబతాడని పెద్దల నమ్మకం. అయితే ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు ముఖ్యంగా మీరు ఎలాంటి ప్రవర్తనను అలవర్చుకోవాలి, ఎలా ఉండకూజదు అనే విషయాలను కూడా చాణక్యుడు తన పుస్తకంలో పేర్కొన్నాడు.
మనిషి జీవితంలో అనేక రకాల వ్యక్తులను కలుస్తూనే ఉంటారు. అయితే ఎవరితో ఎలా నడుచుకోవాలనేది తెలుసుకోవడం ముఖ్యం. అలా వ్యక్తి ప్రవర్తన తెలుసుకొని నడుచుకోవడం వలన జీవితంలో కష్టాలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎరితో ఎలా ప్రవర్తించాలో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.చాలా మంది వ్యక్తులు హింసాత్మక స్వభావం కల్గి ఉంటారు. వీరు ఎప్పుడూ ఏదో ఒక విధంగా మరొకరి జీవితానికి హాని చేయడానికి చూస్తుంటారు. అలాంటి వారిని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వీలైనంత వరకూ ఇటువంటి స్వభావం కల్గిన వ్యక్తులకు దూరంగా ఉండటం మేలు అని చాణక్యుడు పేర్కొన్నాడు. హింసామార్గాన్ని ఎంచుకున్న వ్యక్తుల స్వభఆవం మనల్ని విధ్వంసం వైపు నడిపిస్తుంది.

Chanakya Niti if you want to get respect you must like behave this
అలాగే ఎప్పుడూ చెడు ప్రవృత్తిని కల్గి ఉండకూడదు. ఎవరినీ దుష్ట ధోరణులతో చూడకూడదు. అలాగే అలాంటి వారితో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా అదే విధమైన నిర్ణయాలు తీసుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ఇలా చేసిన తర్వాత ఏ విధమైన పశ్చాత్తాపం చెందకండి. ఎందుకంటే మీరు దుర్మార్గులతో మంచి ప్రవర్తన కల్గి ఉంటే తర్వాత వాళ్లు మీకు చెడు చేస్తారు. అందుకే ఒక్కసారి గుణపాఠం చెబితే మీకు కీడు చేసేందుకే భయపడతారు. అలాగే శ్రేయోభిలాషులందరినీ సమానంగా చూడాల్సిన అవసరం లేదట. ఉపకాలం చేయాలనే ధోరణిని అవలంబించే వారితో పాటు మీరు కూడా పరోపకార వైఖరిని అలవర్చుకోవాలి. అవతలివారు మీ కోసం కొంచెం చేస్తే.. మీరు వారికి రెట్టింపు చేస్తారు. అలాంటి ప్రవర్తనను అలవర్చుకోవడం ద్వారా రెట్టింపు పురోగతిని సాధించవచ్చు.