Chanakya Niti : ఒక వ్యక్తి జీవితం సంతోషంగా ఉండాలంటే… ఈ 4 ప్రదేశాలలో నివసించకూడదు అంటున్న చాణక్య…
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికీ ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఈ నీతి శాస్త్రంలో ఒక మనిషి ఎటువంటి మార్గంలో వెళ్లాలి, ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలో మొదలగు విషయాలు తెలుపబడ్డాయి. వీటిని పాటిస్తే మనిషి జీవితం సుఖమయం అవుతుంది. మానవుడి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఈ శాస్త్రంలో చాణక్యుడు ప్రస్తావించాడు. వీటిని పాటిస్తే జీవితంలో విజయాన్ని పొందవచ్చు. అయితే ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో కొన్ని ప్రదేశాలకి మనిషి వెళ్ళద్దని, అక్కడ ఉండడం అతనికి మంచిది కాదని, ఇబ్బందులు ఎదుర్కోవచ్చని తెలిపారు.
1) చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా మనకు ఇలా తెలిపారు ఒక వ్యక్తి తనకు గౌరవం లభించని ప్రదేశంలో ఎప్పుడూ ఉండకూడదంట. గౌరవం లేని చోట ఒక్క క్షణం కూడా నిలవద్దని చెప్పారు. 2) చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి విద్యాసాధనలు లేని ప్రదేశంలో నివసించకూడదు. అలాంటి చోట ఉండడం నివసించడం అర్ధరహితం. జ్ఞానం లేని జీవితం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఇలా విద్యాసంస్థలు లేని ప్రదేశంలో చిన్నారుల జీవితాలు కూడా ఇబ్బందుల్లో పడతాయి. కనుక చదువు అనేది ప్రతి ఒక్క మనిషికి ముఖ్యం.
3) ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి తనకు బంధువులు లేని స్నేహితులు లేని ప్రదేశంలో నివసించకూడదు. బంధువులు, మేలుకోరే వ్యక్తులు లేని స్థలాన్ని వెంటనే వదిలివేయాలని తెలిపారు. అటువంటి ప్రదేశంలో మీరు ఉంటే అవసరమైనప్పుడు ఎవరు మీతో ఉండరు. కష్టకాలంలో మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. కనుక బంధువులు, స్నేహితులు ఉన్న ప్రదేశంలోనే ఉండాలి. 4) ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి సంపాదన కోసం ఉపాధి మార్గాలు లేని ప్రదేశాలలో కూడా నివసించకూడదు. ఎందుకంటే డబ్బు సంపాదన లేకుండా మనిషి జీవితం గడవడం చాలా కష్టం. కనుక ఉపాధి దొరికే ప్రదేశాలలో ఉండడం శ్రేయస్కరం. ఆర్థికంగా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు.