Chanakya Niti : ప్రతి వ్యక్తికి సంబంధించిన ఈ 4 అంశాలు తల్లి గర్భంలోనే నిర్ణయించబడతాయి…
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు 371BC , బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన గొప్ప విద్యావేత్త. అర్ధశాస్ర్తాన్ని రచించాడు. చాణక్యుడిని `కౌటిల్యుడు` అని కూడా పిలుస్తారు. ఎంతో తెలివైనవాడు, బుద్ధి బలం కలవాడు. ఒక రాజ్యాన్నే ఏల గల సమర్ధుడు. చాణక్యుడు రచించిన రాజనీతి శాస్త్రం మన అందరికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఎంతోమంది ఈ నీతిశాస్ర్తాన్ని అనుసరిస్తున్నారు. నీతిశాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఆచార్య చాణక్యులు తెలిపారు. మనిషి జీవితలో మంచి మార్గంలో వెళ్లేటట్లుగా ఈ నీతిశాస్త్రం సూచిస్తుంది. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ప్రతి మనిషి జీవితం తను పుట్టకముందే తల్లి గర్భంలోనే నిర్ణయించబడతాయంట. ముఖ్యంగా ఈ 4 అంశాలు మనం పుట్టకముందే తల్లి గర్భంలో నిశ్చయించబడతాయంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
1) ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఒక మనిషి తను పుట్టకముందే తన జీవితం ఎలా ఉంటుందో తల్లి గర్భంలోనే నిర్ణయించబడతాయి. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన సంపద, విద్య లాంటి విషయాలు పుట్టకముందే నిర్ణయించబడతాయి. ఒక వ్యక్తి జీవితంలో ధనాన్ని సంపాదించగల సమర్ధుడ లేక అసమర్ధుడ అని ముందుగానే తల్లి గర్భంలో నిర్ణయించబడతాయి. అలాగే విద్యను సరిగ్గా అభ్యసించేవాడు ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడంట.
2)అలాగే ఒక మనిషి తను చేసే కర్మలను బట్టి తన జీవితంలో సుఖదుఃఖాలను అనుభవిస్తాడంట. ఒక మనిషికి సంబంధించిన మంచి, చెడులు గత జన్మలో చేసిన కర్మల ఆధారంగానే ఈ జన్మలో ఎలా ఉండాలో నిర్ణయించబడతాయి. అంటే గత జన్మలో చేసిన పుణ్యాల వలన ఈ జన్మలో మంచి వ్యక్తులుగా జన్మిస్తారు. సుఖసంతోషాలతో జీవిస్తారు. అలాగే మరు జన్మలో పాపం చేసిన వారు అయితే ఈ జన్మలో అనేక దుఃఖాలను అనుభవిస్తారు.
3)ఒక మనిషి వయసు ముందుగానే తల్లి గర్భంలో నిర్ణయించబడుతుందంట. మనిషి ఎన్ని సంవత్సరాలు భూమి మీద జీవించాలో తల్లి కడుపులో ముందుగానే నిర్ణయించబడుతుంది. అందుకే మనిషి ఎప్పుడు మరణిస్తాడో తెలియదు కనుక వీలైనంత వరకు మంచి మార్గంలోనే మనిషి వెళ్లాలి. ఇలా చేయడం వలన ఉన్నంత కాలం మంచి పేరును సంపాదించుకుంటారు.
4) అలాగే ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ప్రతి జీవికి మరణం అనేది ఉంటుంది. మరణాన్ని ఎవరు మార్చుకోలేరు. ఇది జీవిత సత్యం. కనుక జీవించి ఉన్నంత కాలం ఇరువురితో ఎటువంటి ద్వేషాలు, వైరాగ్యాలు లేకుండా సంతోషంగా జీవించాలి. సాధ్యమయ్యే వరకు మంచి పేరు , ప్రతిష్టతలు సంపాదించుకోవాలి. ఈ 4 అంశాలు మనిషి జన్మించక ముందే తల్లి కడుపులో నిర్ణయించబడతాయి అని ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో వివరంగా తెలియజేసారు.