Chanakya Niti : విద్యార్థులు విజయం సాధించాలంటే అది ఉండకూడదట .. చాణక్యుడి నీతి చెప్పిందిదే
Chanakya Niti : విద్యార్థి దశ… ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ. ఈ దశలో మనం చేసే పనుల వలనే మన భవిష్యత్ నిర్ణయించబడుతుంది. కావున ఈ దశలో ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. ఒక వేళ మనం ఏవైనా మిస్టేక్స్ చేశామో మన జీవితం ఎంత ప్రయత్నించినా కానీ సరైన దారిలోకి రాదు. తర్వాత మనం చాలా బాధపడాల్సి వస్తుంది. ఆచార్య చాణక్యుడు కూడా అనేక విధాలుగా నీతి సూక్తులు బోధించాడు. ఎప్పుడు ఎలా మెదులుకోవాలే, ఎటువంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో ఈయన చాలా కూలంకుషంగా చర్చించాడు.
ఎటువంటి అలవాట్లను కలిగి ఉండాలో కూడా తెలిపాడు. కొన్ని అలవాట్లు మనుషులను ఏ విధంగా నాశనం చేస్తాయో చాలా స్పష్టంగా తెలియజెప్పారు. ఆచార్య చాణక్యుడి నీతి బోధనలు చాలా సందర్భాల్లో నిజం అయ్యాయి. ఆయన బోధనలను చాలా మంది ఇప్పటికీ ఫాలో అవుతారు.ఆచార్య చాణక్యుడు విద్యార్థుల గురించి చాలా నీతి వ్యాక్యాలు బోధించాడు. విద్యార్థులు ఎలా ఉండాలో.. ఎలా మసులుకోవాలో కూలంకుషంగా చర్చించాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం విద్యార్థికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. క్రమశిక్షణ ఉన్న విద్యార్థి అన్ని రంగాల్లో విజయం సాధిస్తాడని చాణక్యుడు తెలిపాడు.
Chanakya Niti : విద్యార్థులు అది అస్సలుకే కలిగి ఉండకూడదట..
క్రమశిక్షణ లేని విద్యార్థి ఏపనిని కూడా సకాలంలో పూర్తి చేయలేడని హెచ్చరించాడు. విద్యార్థులకు సోమరితనం అతి పెద్ద శత్రువని కూడా పేర్కొన్నాడు. విద్యార్థులు సోమరితనానికి దూరంగా ఉండాలని తెలిపాడు. సోమరితనం లేని విద్యార్థులు ప్రతి పనిని తొందరగా పూర్తి చేస్తారని పేర్కొన్నాడు. దురాశ అనేది విద్యార్థి విజయానికి అవరోధంగా మారే అతి పెద్ద అంటువ్యాధి అని చాణక్యుడు తెలిపాడు. కావున విద్యార్థులకు దురాశ ఉండకూడదని పేర్కొన్నాడు. దురాశ ఉన్న విద్యార్థులు ఏ పనిలో కూడా విజయం సాధించలేరన్నాడు.