Chanakya Niti : ఎవరితో ఎలా ఉండాలో చెప్పిన చాణక్య.. ఇవి పాటిస్తే మీకు తిరుగుండదు
Chanakya Niti : చాణక్యుడు.. కౌటిల్యుడు.. విష్ణుగుప్తుడు అని పిలవబడే చాణక్య తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలు ప్రస్తావించాడు. ఆయన రచించిన గ్రంథాలను చాలామంది పాటిస్తూ ఉంటారు. ప్రస్తుత జనరేషన్ కూడా చాణక్యుడి నీతిని ఫాలో అవుతుందంటే ఆయన ఎంత ప్రభావవంతంగా నీతి సూత్రాలను బోధించారో అర్థం చేసుకోవచ్చు. ఆయన రచించిన నీతిశాస్త్రం ప్రజలకు జీవిత విధానాలను నేర్పిస్తుంది.
ఎంతో మేధస్సు కలిగిన చాణక్యుడు ఆర్థికశాస్త్రం, రాజకీయాలు, దౌత్యం లాంటి విషయాలపై ఎంతో పట్టు సాధించాడు. చాణక్యుడు అధ్యాపకుడిగా పలు విశ్వవిద్యాలయాల్లో బోధించాడు. అనేక గ్రంథాలను రచించాడు. శత్రువులను, ప్రజలను అర్థం చేసుకోవడంలో చాణక్య తర్వాతే ఎవరైనా.
చాణక్యుడు తన గ్రంథంలో మనిషి జీవితానికి సంబంధించిన చాలా విషయాలు ప్రస్తావించాడు. ఎలా ఉండాలి.. ఎలా ప్రవర్తించాలి. ఎవరితో ఎలా నడుచుకుంటే సంఘంలో గౌరవ మర్యాదలు ఎలా పెరుగుతాయో వివరించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..హింసాత్మక భావాలు కలిగిఉన్నవారితో దూరంగా ఉండాలని చాణక్య తన నీతి శాస్త్రంలో సూచించాడు. వారి స్వాభావం మనల్ని విధ్వంసం వైపు నడిపిస్తుందని హెచ్చరించాడు. వీరు ఎప్పుడు ఎవరో ఒకరికి హాని చేస్తుంటారని విలైనంతవరకు వారికి దూరంగా ఉంటే మంచిదని పేర్కొన్నాడు.చాణక్యుడి నీతి ప్రకారం ఎప్పుడూ చెడు ఆలోచనలతో ఉండేవారికి దూరంగా ఉండాలని అన్నాడు.
చెడు స్వభావం కలవారు మీకు చెడు చేస్తే మీరు కూడా అదే మార్గంలో వారికి సమాధానం చెప్పాలని తెలిపాడు. ఇలా చేస్తున్నందుకు ఏమాత్రం బాధపడకూడదని అన్నాడు. ఎందుకంటే మీకు చెడు చేసినవారికి మీరు కూడా అదే మార్గంలో చెడు చేస్తే మళ్లి చేయడానికి ఆలోచిస్తారని పేర్కొన్నాడు. దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నవారిని గమనించి నడుచుకోవాలని సూచించాడు.మనకు మంచి చేసినవారికి మనం రెట్టింపు సాయం చేస్తే రెట్టింపు విజయం సాధించే అవకాశం ఉంటుందని సూచించాడు. మన శ్రేయోభిలాషులను గౌరవించి వారికి సాయపడితే మన విజయానికి తోడ్పడతారని అన్నాడు. అలాగని వారికి ప్రతి విషయంలో వంతపాడకూడదని సూచించాడు. అందరిని సమానంగా చూడాల్సిన అవసరం కూడా లేదని అన్నాడు.