Chanakya Niti : మంచివారికి వరుసగా కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా..?
Chanakya Niti : ఎన్ని పూజలు వ్రతాలు చేసిన మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయి. అసలు జీవితంలో ఒక్కసారి కూడా గుడికి వెళ్ళని వాడు.. పిల్లికి బిక్షం పెట్టినవాడు కూడా సుఖంగా బతుకుతున్నాడు. ఎందుకిలా జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చర్యకు ప్రతి చర్య అనేది తప్పకుండా ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేసి చేతులు దులుపు వేసుకొని ఎవరు చూడలేదులే మనకి కాదులే అని వెళ్ళిపోయినా.. మనం చేసే ప్రతి పనిని పంచభూతాలైన గాలి, నీరు, నేల, ఆకాశం అగ్నిలో నిరంతరం గమనిస్తూ రికార్డ్ చేస్తూ ఉంటాయి. ఈ జన్మలోనే అనుభవించాలా లేదా మరో జన్మలోకి బదిలాయించాలా అనేది నిర్ణయిస్తాయి. దీనినే కర్మఫలం అని అంటారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి తాను గత జన్మలో చేసిన పాపం పుణ్యాల యొక్క కర్మ ఫలాన్ని మరోజన్మలో కచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కర్మ ఫలాన్ని అనుభవించకుండా అకాల మరణం వల్ల చనిపోతే అది మరో జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ నాశనం కాదు.. జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ధనవంతులు ఇంట్లో పిల్లలు బుద్ధిహీనంతో అంగవైకల్యంతో ఉంటారు. ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్న ఏదో వారు అనుభవించలేరు. అది కర్మఫలం అంటే.. ఘోర పాపాలు చేసి ఉంటే అంటే ధనాన్ని దొంగలించడం, వేరొకరికి అంగవైకల్యం కలిగించిన వంటి పాపాలను చేస్తే వారు ఈ జన్మలో ఎలాంటి పుట్టుకలో పుట్టవలసి ఉంటుంది.
ఇది బానే ఉంది.. మరి వారి తల్లిదండ్రులు ఏం చేశారు. గత జన్మలో వారి పిల్లోడు చేసిన పాపాలకు వీరు ఎందుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంటే.. పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు. మనకు వారసత్వం ద్వారా ఎలా అయితే సంక్రమిస్తాయో అదేవిధంగా వారు చేస్తున్న పాప పుణ్యాలు కూడా వారి తరాలు వారికి తప్పకుండా బదిలీ అవుతాయి. వారు ఉసురు అనేది వారి తరతరాల వారికి ఏదో విధంగా కొడుతూనే ఉంటుంది. అలాంటి వారి ఇంట్లోనే ఇలా గత జన్మలో ఘోర పాపాలను చేసిన వారు ఈ జన్మలో కర్మ ఫలాన్ని అనుభవించడానికి పుడుతూ ఉంటారు.. ఇక మంచి వారికి ఎందుకు వరుసగా కష్టాలు వస్తున్నాయి అనే విషయానికి వస్తే.. వారు ఈ జన్మలో ఎలాంటి దోషాలు చేయకపోయినా గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో ఫలితం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. బంగారాన్ని ఎంతో వేడిలో మరిగిస్తే కానీ అందమైన ఆభరణంగా మారదు. అలానే వరుసగా కష్టాలు అనేవి ఎప్పటికీ ఉండవు. చెడు వెనకే మంచి కష్ట వెనకాల సుఖం అనేది తప్పకుండా ఉంటుంది. గత జన్మలో చేసిన పాపాలతో ఈ జన్మలో మనం చేస్తున్న పుణ్యం అనేది బాలన్స్ అవుతూ ఆ కర్మఫలం అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది.. అలా కూడా కష్టాలు తీరకపోతే పరిహారం పశ్చాత్తాపం అనే రెండు మార్గాల ద్వారా మన కర్మ ఫలాన్ని తగ్గించుకోవచ్చు.
పరిహారం అంటే పేదవారికి ధన సహాయం చేయడం, అన్నదానం చేయడం లాంటి సత్కర్మలు చేయాలి. పశ్చాత్తాపం అంటే దైవం దగ్గరకు వెళ్లి స్వామి నేను ఈ జన్మలోను లేక గత జన్మలోను తెలుసో తెలియకో పాపలను చేశాను. ఇక నుంచి నేను మంచి కర్మలను మాత్రమే చేస్తాను అని నిష్కరణశుమైన మనసుతో ఆ భగవంతున్ని ప్రార్థిస్తే వారు అనుభవించాల్సిన కర్మఫలం అనేది తగ్గుతుంది. కానీ ఎప్పుడూ అధైర్య పడకూడదు. కాలుచక్రంలో కష్టమేనుక తప్పకుండా సుఖం వస్తుందని విషయాన్ని నమ్మి ధైర్యంగా మన పనులు మనం చేసుకుంటూ ఎవరికీ అపకారం చేయకుండా మనకు చేతనయినంతవరకు ఎదుటి వారికి సహాయపడుతూ దైవాన్ని స్మరిస్తూ వెళుతూ ఉంటే ..అంతా మంచే జరుగుతుంది. మంచి పనులు చేసే వారికి ఊహించని కష్టం ఎదురైనా సరే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సాయం చేస్తూ ఆ కష్టం నుంచి బయట పడేస్తూ ఉంటాడు.