Chanakya Niti : ఈ 5 విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి… లేదంటే సర్వం కోల్పోతారు…
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు గురించి అందరికీ తెలిసిందే. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం ఇప్పటి వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ పుస్తకంలో ఒక మనిషి తన జీవితంలో విజయం సాధించడానికి ఎటువంటి మార్గంలో ప్రయాణించాలి. అలాగే ఎటువంటి నియమాలను పాటించాలి అని ఉంటుంది. ఒక మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలు చాణక్యుడు రచించిన నీతి శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. జీవితంలో ఎదుటివారితో ఎలా మెలగాలి? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? ప్రకృతితో ఎలా ఉండాలి? మొదలగు అంశాలన్నింటినీ నీతి శాస్త్రం ద్వారా వివరించాడు. అయితే ఈ నీతి శాస్త్రంలో ఒక మనిషి 5 విషయాలతో జాగ్రత్తగా ఉండాలంట, లేకపోతే సర్వం కోల్పోతారు అని చాణక్యుడు హెచ్చరించారు.ఆ 5 విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
1) చాణక్యుడు నీతి శాస్త్రం ద్వారా కొందరి వ్యక్తులను అస్సలు నమ్మకూడదని చెప్పారు. ముఖ్యంగా ఉన్నత కులస్తులను అంటే రాజ వంశస్తులను గుడ్డిగా నమ్మకూడదని చెప్పారు. ఎందుకంటే వారిలో కొంతమంది తమ అధికారం కోసం ఎవరినైనా వినియోగించుకుంటారు. దానికోసం ఏమాత్రం వెనుకాడరు. అవసరం కోసం ఎవరినైనా దగ్గరకు చేరదీస్తారు. అనవసరం అనుకుంటే వదిలేస్తారు కూడా. ఇలాంటి వారిని గుడ్డిగా నమ్మి జీవితంలో కష్టాలపాలు కావద్దు అని హితవు పలికారు. కనుక ఇలాంటి వారితో జీవితంలో తప్పక జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ జీవితాన్నే కోల్పోతారు.
2) అప్పుడప్పుడు వచ్చి పోయే వరదలకు ఉప్పొంగే నదులను, వంతెనలను కూడా తట్టుకోలేని నదులను ఎప్పుడు నమ్మకూడదు. ఇలాంటి నదులపై ఉన్న వంతెనలతో జాగ్రత్తగా ఉండాలి. నదీ ప్రవాహం ఎప్పుడు వేగంగా మారుతుందో తెలియదు. వీటిని నమ్మి ప్రయాణం చేస్తే జీవితమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే మన జీవితంలో ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలా అని అందరిని గుడ్డిగా నమ్మేయకూడదు జీవితం ఇరకాటంలో పడుతుంది.
3) అలాగే ఆయుధాలు కలిగిన వారిని విశ్వసించకూడదు. అలాంటి మనుషులకు ఆగ్రహం వస్తే ఏం చేస్తారో ఊహించడం కష్టం. ఆయుధాలు కలిగిన వారు మీ ఎదురుగా ఉండి, వారికి మీరు కోపం తెప్పిస్తే మిమ్మల్ని దాడి చేసే ప్రమాదం ఉంది. ఆ సమయంలో మీరు మీ ప్రాణాలను కూడా కోల్పోవచ్చు. దీనివలన మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. అందువలన ఆయుధాలు పట్టుకున్న వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే అలాంటి వారిని ఎప్పుడు నమ్మకూడదు.
4) పెద్ద గోర్లు, కొమ్ములు కలిగిన జంతువులను కూడా అసలు నమ్మకూడదు. అవి మనపై ఎప్పుడు దాడి చేస్తాయో చెప్పలేం. ఒకవేళ వాటిని నమ్మి చనువుగా ప్రవర్తిస్తే, అవి ఒకవేళ మనపై దాడి చేస్తే మాత్రం తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. లేకపోతే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కనుక అలాంటి క్రూర జంతువులకు దూరంగా ఉండటం ఉత్తమం.
5) చంచల స్వభావం గల స్త్రీలను అసలు నమ్మకూడదు. వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఆలోచన విధానం వేరేలా ఉంటుంది. అలాంటివారు మీకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు జీవితంలో అనేక కష్టాలను అనుభవిస్తారు. కనుక అలాంటి స్త్రీలను గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది. లేకపోతే జీవితంలో అన్నింటిని కోల్పోతారు.